Wednesday 1 June 2011
Friday 20 May 2011
Thursday 12 May 2011
వెర్రిదద్దమ్మలు
అక్షరాలు
ఒకటికొకటిగా ఘర్షణపడుతున్నాయి
ఏదో ఒక్క విషయంలోనైనా
ఏకీభవించొచ్చుగా
ఒకటి తూర్పు
మరొకటి పడమర వైపు
వాస్తవం..
నాకు తెలుసంటే నాకు తెలుసు
పాపం
పాపం రెండు దృవాల మధ్య
నిజం పిచ్చిదైపోతుంది
..
అదిగో
మనం ఎంతో ఇష్టంపడి
ఒక్కటిగా పేర్చుకున్న
రెండక్షరాలు
చీలు పోతున్నాయి
పాపం
నిజాన్ని నిర్భయంగా చెప్పే
సాహసం నాకు లేదు
నా అక్షరాలు..
వెన్నెల్లో ఆడుకునే
ఆడపిల్లలు కాదు
ఇది నిజమని చెప్పలేని వెర్రిదద్దమ్మలు
ఒకటికొకటిగా ఘర్షణపడుతున్నాయి
ఏదో ఒక్క విషయంలోనైనా
ఏకీభవించొచ్చుగా
ఒకటి తూర్పు
మరొకటి పడమర వైపు
వాస్తవం..
నాకు తెలుసంటే నాకు తెలుసు
పాపం
పాపం రెండు దృవాల మధ్య
నిజం పిచ్చిదైపోతుంది
..
అదిగో
మనం ఎంతో ఇష్టంపడి
ఒక్కటిగా పేర్చుకున్న
రెండక్షరాలు
చీలు పోతున్నాయి
పాపం
నిజాన్ని నిర్భయంగా చెప్పే
సాహసం నాకు లేదు
నా అక్షరాలు..
వెన్నెల్లో ఆడుకునే
ఆడపిల్లలు కాదు
ఇది నిజమని చెప్పలేని వెర్రిదద్దమ్మలు
Wednesday 11 May 2011
Sunday 8 May 2011
Monday 2 May 2011
రెండు రెళ్ళు ఆరు
నిజంగానే
రెండు రెళ్ళు ఆరు
రెండు రూపాయలు సంపాదించగలిగితే
మరో నాలుగు రూపాయల
బారం నెత్తిమీద పెరుగుతూనే ఉంది
నేను సగటు మధ్య తరగతి జీవిని
నేను చదువుకున్న గుణింతాల్లో
రెండు రెళ్ళు నాలుగనే ఉంది
...
కానీ
మా పిల్లాడు చదివే
గుణింతాల పుస్తకాల్లో
రెండు రెళ్ళు ఆరు.. అని
మార్చాలి
మార్చితేగానీ
నా కొడుక్కి
నా కష్టమేంటో అర్ధంకాదు
...
పాపం వాడూ..
వాడి.. కొడుకొస్తే
రెండు రెళ్ళు ఆరు...
కాదు కాదు
రెండురెళ్ళు పదహారు అని నేర్పుతాడేమో..?
రెండు రెళ్ళు ఆరు
రెండు రూపాయలు సంపాదించగలిగితే
మరో నాలుగు రూపాయల
బారం నెత్తిమీద పెరుగుతూనే ఉంది
నేను సగటు మధ్య తరగతి జీవిని
నేను చదువుకున్న గుణింతాల్లో
రెండు రెళ్ళు నాలుగనే ఉంది
...
కానీ
మా పిల్లాడు చదివే
గుణింతాల పుస్తకాల్లో
రెండు రెళ్ళు ఆరు.. అని
మార్చాలి
మార్చితేగానీ
నా కొడుక్కి
నా కష్టమేంటో అర్ధంకాదు
...
పాపం వాడూ..
వాడి.. కొడుకొస్తే
రెండు రెళ్ళు ఆరు...
కాదు కాదు
రెండురెళ్ళు పదహారు అని నేర్పుతాడేమో..?
Sunday 1 May 2011
Saturday 30 April 2011
మేడే.. ఈనాడే
ప్రపంచపు నలుదిక్కుల నీవు
ప్రపంచ గమనానివి నీవు
ఉప్పెంగె గీతం నీవు
ఆకాశానికి నిచ్చెన నీవు
.......
అభివృద్ధికి వెలుగుల రేఖవు నీవు
అభ్యుదయానికి కాంతి నీవు
.....
మానవాళి పాటవు నీవు
మానవత్వానికి బాటవు నీవు
......
శ్రమకు నిర్వచనం నీవు
నవతకు శుభోదయం నీవు
....
మండుటెండలో
స్వేదం చిందే కర్తవ్యానివి నీవు
శ్రామికుడు నీవు
కార్మికుడు నీవు
.....
ప్రియతమ కార్మికులారా
మరో ప్రపంచం కోసం
సంఘటితంగా ఉద్యమిద్దాం
.......
ప్రపంచ గమనానివి నీవు
ఉప్పెంగె గీతం నీవు
ఆకాశానికి నిచ్చెన నీవు
.......
అభివృద్ధికి వెలుగుల రేఖవు నీవు
అభ్యుదయానికి కాంతి నీవు
.....
మానవాళి పాటవు నీవు
మానవత్వానికి బాటవు నీవు
......
శ్రమకు నిర్వచనం నీవు
నవతకు శుభోదయం నీవు
....
మండుటెండలో
స్వేదం చిందే కర్తవ్యానివి నీవు
శ్రామికుడు నీవు
కార్మికుడు నీవు
.....
ప్రియతమ కార్మికులారా
మరో ప్రపంచం కోసం
సంఘటితంగా ఉద్యమిద్దాం
.......
Tuesday 26 April 2011
ఇద్దరిదీ ఒకే ఊరు
ఇద్దరిదీ ఒకే ఊరు
ఇద్దరిదీ ఒకే వీధి
ఇద్దరు చదివిందీ ఒకే బడి
ఇద్దరు నడిచింది ఒకే నేల
ఇద్దరు మొక్కిందీ ఒకే దేవుడు
కానీ..
వాడు నాకంటే పైకి
ఎదిగిపోతున్నాడని నాకు మహా కుళ్ళు..
వాడికీ అంతే
నేనెక్కడ వాణ్ణి మించిపోతానేమోనని
....
ఇద్దరిదీ ఒకే కొలువు
కానీ ఎప్పుడూ మాట్లాడుకోం
వాడిల్లే దారిలో నేను
నేను వెళ్ళేదారిలో వాడు
గోతులు తవ్వుకుంటుంటాం
...
మేం నీతిమంతమైన
అక్షరాలు తెలిసిన మేధావులం
ఎదుటివాడికి నీతులు చెప్పే
అంబోతులం
ఇద్దరిదీ ఒకే వీధి
ఇద్దరు చదివిందీ ఒకే బడి
ఇద్దరు నడిచింది ఒకే నేల
ఇద్దరు మొక్కిందీ ఒకే దేవుడు
కానీ..
వాడు నాకంటే పైకి
ఎదిగిపోతున్నాడని నాకు మహా కుళ్ళు..
వాడికీ అంతే
నేనెక్కడ వాణ్ణి మించిపోతానేమోనని
....
ఇద్దరిదీ ఒకే కొలువు
కానీ ఎప్పుడూ మాట్లాడుకోం
వాడిల్లే దారిలో నేను
నేను వెళ్ళేదారిలో వాడు
గోతులు తవ్వుకుంటుంటాం
...
మేం నీతిమంతమైన
అక్షరాలు తెలిసిన మేధావులం
ఎదుటివాడికి నీతులు చెప్పే
అంబోతులం
Saturday 23 April 2011
చరణ కమలాలకు ....
దివ్యజ్యోతి రూపంలోకి
మారిన అమృతమూర్తి
భౌతికంగా మానవాళికి
దూరంగా వెళ్ళినాగానీ..
అచంచలమైన మానవతావాదాన్ని
ప్రపంచానికి అందించిన
బాటను ఎవ్వరూ
దాటిపోలేరు.
దూరంకాలేరు
బాబా.. ఓ సేవానిరతి
బాబా.. ఓ అద్వితీయ శక్తి
బాబా.. కోట్ల ప్రజల విశ్వాసం
బాబా.. నిరంతర గమనం
బాబా.. ఓ ఆత్మవిశ్వాసం
బాబా..
మనల్ని నడిపించే శక్తి
.......
....
చరణ కమలాలకు
అంజలి ఘటిస్తూ......
Friday 22 April 2011
ఈనాడులో
ఈనాడులో పనిచేసేటప్పుడు.. ఆడవారు అబలలు కాదు.. కండలు తిరిగిన మగవాళ్లను సైతం ధైర్యంగా చిత్తుచేసే మహరాణులు కూడా అనే అర్ధంలో నగరంలో పెరుగుతున్న మహిళా యోగా సెంటర్లుపై సిటీ పేజీల కోసం ఆర్టికల్ రాశాను. నేను రాసిన ఆర్టికల్‌కు నేనే వేసిన బొమ్మనే ఆ.. ఆర్టికల్‌కు వాడుకున్నారు.. ఆ బొమ్మను భద్రంగా దాచుకోవడంవల్ల.. ఇప్పడు ఇదిగో ఇలా బ్గాగులో దర్శనం ఇచ్చింది
Thursday 21 April 2011
శబ్దాలు మారుతున్నాయ్
శబ్దాలు మారుతున్నాయ్
నిశ్శబ్దం రాను రాను
ఘొల్లుమంటుంది.
.....
ఆకలి అర్తనాదాలూ...
మూగబోతున్నాయ్
....
వలసలు
వరస క్రమంలో
పట్నాలకు క్యూ కడుతూనే ఉన్నాయి
...
పల్లెలు.. తోడులేక
ఘొల్లుమంటున్నాయి
...
పట్నంలోని బతుకూ...
గూడులేక
నిశిరాత్రి వరకూ
బువ్వకష్టాలు పడుతూనే ఉంది
....
పల్లెలు
పట్నాలు.. రెండూ
మూగబోతున్నాయ్.
సారీ......
రోదిస్తున్నాయ్
నిశ్శబ్దం రాను రాను
ఘొల్లుమంటుంది.
.....
ఆకలి అర్తనాదాలూ...
మూగబోతున్నాయ్
....
వలసలు
వరస క్రమంలో
పట్నాలకు క్యూ కడుతూనే ఉన్నాయి
...
పల్లెలు.. తోడులేక
ఘొల్లుమంటున్నాయి
...
పట్నంలోని బతుకూ...
గూడులేక
నిశిరాత్రి వరకూ
బువ్వకష్టాలు పడుతూనే ఉంది
....
పల్లెలు
పట్నాలు.. రెండూ
మూగబోతున్నాయ్.
సారీ......
రోదిస్తున్నాయ్
Tuesday 19 April 2011
కాక్టైల్ మత్తులో
కాక్టైల్ మత్తులో జోగినట్టు
పొద్దంతా
గందరగోలపు సుడులు తిరుగుతోంది
దిక్కుమాలిన
ఆలోచనలు.. ఒకటీ
స్పష్టంగాలేవు
నిన్న ఎలాగోలా గడిచిందనే
ఆనందం.. క్షణపాటైనా ఉంటేగా
రెక్కలు కట్టుకుని మరీ
ఈరోజు..
ఏదో బద్ద శతృత్వం ఉన్నట్టు
సుడులు సుడులుగా
మెదడ్ని
తురుమేస్తుంది
...
ఇరానీ ఛాయ్ తాగినా
వదిలిపోని నిట్టూర్పు
వడగాలికే భయం పుట్టేంత
శ్వాషలో వేడిగాలులు
...
దేనికో వెదుకులాట
అడ్రస్ తెలిస్తే..
వెళ్లిపట్టుకోడానికి
...
వెదకాలి
పొద్దనక
రాత్రనక
జీవితమనక..
Monday 18 April 2011
కాలం తెలియని జ్ఞాపకం..
ఏదో జ్క్ష్ఞాపకం
కలలా వచ్చి పోతోంది
ఆనక
తడిమి చూస్తే
స్పష్టంకాని దృశ్యం
అలలై వెంటాడుతూనే ఉంది
...
ఎక్కడ
నీ చిరునామా?
చెబితే
గోరుముద్దలు తినిపిస్తా..
...
మళ్ళీ..
ఏజామునో కునుకుపాటు
ఈసారి..
నీ నడకల చప్పుడు..
...
మెలకువలోనూ
నువ్వెక్కడ? అని
అనలేక ఉండలేక పోతున్నాను
...
ఏదో జ్ఞాపకం
కాలం తెలియకుండా
వెంటాడుతూనే ఉంది
...
Sunday 17 April 2011
కాలం కరిగిపోతుంది
కాలం కరిగిపోతుంది
వేగంగా అడుగులెయ్యి
...
దీపం ఆరిపోకముందే
ఆశల్ని వెలుగించు
....
నిన్నా మొన్నటి స్నప్నాలేవో
కృంగదీయొచ్చుకాక
ధైర్యంగా నిలబడు
...
అసాధ్యమని
మనస్సును మరల్చకు
నీవు సాధిస్తావ్..
...
అదిగో
చెమట బిందువులు
నీ పక్షానే ఉన్నాయి
..
నువ్వు కష్టపడే మనిషివి
జయించు
ఒక తరాన్ని నీతో నడిపించు
...
పేదవాడివనుకోకు
పిడికిలి బిగించు.. సాధిస్తావ్
...
Saturday 16 April 2011
అనితరం..
నువ్వేం సాధించావురా..
అని అడిగితే..
ఏం సాధించాలి
అమ్మ కడుపున పుట్టాం అది చాలదా..
అనే చెప్తాను..
అమ్మ ప్రేమ అనితరం
అమ్మ ప్రేమ ఆశీర్వాదం
ఇంతకు మించి ఏంకావాలి
ఎవరికైనా
*****
*****
చాలా ఏళ్ళ క్రితం
సుమారు 2002_2003 మధ్య కావచ్చు
ప్రజాశక్తిలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పనిచేస్తున్నాను..
..
యాధాలాపంగా పెన్సిల్‌తో అలా.. అలా గీసి
తర్వాత బ్రషింగ్ చేశాను..
****
పాత పుస్తకాలు తిరిగేస్తుంటే
అమ్మ బొమ్మ మళ్ళీ భద్రంగా నా దగ్గరకొచ్చింది
...
..
దొరికిన ఈ అమ్మ బొమ్మకు
నా పైత్యాన్ని ఫొటోషాప్ రంగుల రూపంలో
కాస్త అద్ది.. ఇదిగో ఇలా తయారు చేశానన్నమాట
Thursday 14 April 2011
సారీ చిత్రగారు
చిత్రగారి పాపకు హాయ్ చెప్పాను..
ఈ మాట అంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయ్.
*******
నాలుగైదేళ్ళ క్రితం మాట
చిత్రగారు... హైదరాబాద్‌లో కచేరి చేయడానికి భర్త, పాపతో కలిసి వచ్చారు. అప్పట్లో ఈటీవిలో పనిచేస్తున్నాను. చిత్రగారు సిటీ వస్తున్నారని తెలిసి మిగితా మీడియాకంటే ముందుగానే కలిసి ప్రత్యేక ఇంటర్వూ తేవాలని ప్లాన్ చేసుకున్నాను. అలా చిత్రగారిని కలిశాను.
నాలక్కీ ఏమిటంటే... నేను ఇలా హోటల్ గదికి చేరుకున్నానో... లేదో.. చిత్రగారికి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనట్టు ఫోనొచ్చింది.
నా ఆనందానికి అవదుల్లేవు.
అసలే చిత్రగారి ఇంటర్వ్యూ, పైగా పద్మశ్రీ వచ్చిన సందర్భం..
మేము కెమెరా.. లైట్స్ సెట్ చేసుకుంటున్న క్రమంలోనే చిత్రగారికి ఫోన్ల తాకిడి మొదలయ్యింది. అయినా చిత్రగారు కెమెరా ముందు కూర్చుని కమ్మగా మాట్లాడుతూ... సారీ పాట్లాడుతూ ఉన్నారు
******
మధ్యలో
ఓ బుల్లి పాప.. మళయాళ భాషలో ఏదో సవ్వడి చేసుకుంటూ చిత్రగారి వళ్లో వాలిపోయింది.
కెమెరా రికార్డింగ్ ఆపకుండానే మేమంతా ఆ ముచ్చట షూట్ చేసేశాం..
`ఈ కుట్టి మన దగ్గరుంటే ఇంటర్వ్యూ సాగదు.. ` అంటూ
పాప.. నందనను మరో రూంలోకి పంపబోయారు చిత్ర..
అప్పడే చిత్రగారి పాప నందనను మొదటిసారి చూశాను.. అదే ఆఖరుసారి కూడా.
అటు ఇటు రెండు పిలకలేసుకుని.. చాలా ముద్దుగా ఉంది.
హాయ్ అని చెప్పా.. అమాయకంగా నవ్వింది.
పాపలో.. దేవుడు కొంచెం అమాయక పాల్లు.. పోశాడనిపించింది
....
పాప గదిలో అల్లరి చేస్తుండగానే.. చిత్రగారు ఇంటర్వ్యూ పూర్తి చేశారు..
ఇంటర్వ్యూ పూర్తవ్వగానే.. గదిలో బంధించిన పాప బిలబలమంటూ బయటకొచ్చేసింది.
...
మరోసారి మేమంతా నందనకు హాయ్ చెప్పాము
అప్పడు నందన మూడేళ్లపాప
ఇప్పడు నందన ఎనిమిదేళ్ళ పాప
దేవుడు నందనకు అమాకపాల్లు ఎక్కువ పోశాడని ముందే చెప్పాగా..
మూడేళ్లప్పుడు ఎలా ఉందో..
ఎనిమిదేళ్ళప్పుడు కూడా అదే అమాకత్వం..
అందుకే నందన..
నీటిని ఓ నేస్తం అనుకుంది
..
సారీ నందన
నీకు తెలియదా?
నీకు నీటి గండం ఉందని..
.....
సారీ చిత్రగారు
మీరెప్పుడూ నవ్వుతూ ఉంటారు
నందన కోసం ఆ నవ్వును అలాగే కొనసాగించండి
నందన కోసం పూలపరిమళాల పాటలు ఇంకా ఇంకా అద్దండి
...
యిక్కడ నుంచి మీరు పాడే లాలిపాటల్ని
నందన కచ్ఛితంగా
అక్కడనుంచి వింటుంది
...
మీరు పాడే పాట రూపంలో
నందన
ఎప్పటికీ మీ వెంట ఉంటూనే ఉంటుంది
........
.......
Wednesday 13 April 2011
Tuesday 12 April 2011
Monday 11 April 2011
Sunday 10 April 2011
Friday 8 April 2011
ఒకే ఒక్కడు
ఒకే ఒక్కడు
దేశాన్ని ఊపుతున్నాడు..ఒకే ఒక్కడు..
కోట్ల ప్రజల ఆలోచల్ని ప్రజ్వలింప చేస్తున్నాడు
..........
ఒకే ఒక్కడు..
అవినీతిపై పోరాడలేక రాజీపడిన
ఉక్రోషాన్ని....ఆవేశాన్ని
గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేలా చేస్తున్నాడు
............
ఒకే ఒక్కడు
జాతి పౌరుషాన్ని
ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడేలా పుణ్యం కట్టుకున్నాడు
...
నిన్నా మొన్నటి దాకా
అవినీతినెదిరించే మొనగాడే లేడాయే..
ఇదిగో..
72 ఏళ్ళ యువకుడొచ్చాడు..
మనందరికీ కొండంత స్ఫూర్తినిచ్చాడు..
...
ఖబడ్డార్.. అవినీతి రాక్షసి
ఖబడ్జార్..
ఇప్పడు
కోట్ల ప్రజల భారతావనిలో..
ఇంటికొక `అన్నా హజారే` ఉద్భవించాడు
నిన్ను తరిమి తరిమి కొట్టడానికి
....
జిందాబాద్ అన్నా హజారే
ఇక నువ్వంటే అవినీతికి బేజారే..
Thursday 7 April 2011
అవినీతిపై శంఖారావం
ఇది అన్నా హజారే.. వాదం
నీతిమాలిన కుక్కలు
పందుల చేసిన తప్పులతో..
ఎన్నో ఏళ్ళుగా.. అవినీతి..
ఎన్నో వికృత రూపాలను దాల్చి
అవినీతి అనేది ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది
....
కనీసం అవినీతిపై పోరాటం చేయడానికైనా
ఒక్కరైనా మనుషులు మిగలనంతగా
మన నరనరాల్లో ఇంకిపోయింది..
కలిసిపోయింది..
అవినీతిని నమ్ముకున్న వారిని
ప్రోత్సహించడానికి
అలవాటయి పోయింది
...
అవినీతిని నమ్ముకుంటేగానీ
జీవితంలో రెండడుగులు వేయలేవేమో అన్నంతగా
అవినీతి.. అల్లుకుపోయింది..
ఇప్పటికైనా
అన్న హజారే పిలుపునందుకుందాం
అవినీతి ఏ రూపంలో ఉన్నా..
మక్కెలు విరగ్గొడదాం..
Wednesday 6 April 2011
సూత్రధారి రమ్మన్నాడా....
నటి సుజాత.. అనాలంటే ఎవ్వరికైనా కష్టమే
నాకు బాగా గుర్తు..
సంగీతమంటే వల్లమాని ప్రేమ కనుక
సుజాత సినిమాలోని
`` ఉంగరం పడిపోయింది.. పోతేపోనీ
కొంగుజారి పోయింది.. పోతే పోనీ..
ఉంగరం పడిపోయినా.. కొంగుజారి పోయినా...
హృదయం మాత్రం పదిలం పదిలం... ``
ఇంకా సుజాత గారి గురించి ఏం చెప్పాలి..
ఆవిడది...
మా అమ్మ వయసని చెప్పాలని ఉంది
మా అమ్మ, పక్కింటి పిన్ని, ఆంటీ వీళ్ళంతా..
ఇంట్లో మగవాళ్ళకు తెలియకుండా
గోరింటాకు, కార్తీక దీపం వంటి సుజాత మేడం సినిమాలెన్నో
చూశారని చెప్పాలని ఉంది.
ఇంకా..
మా భార్య అంజు..
గర్వంగా చెప్పాలని ఉంది..
సుజాతమ్మ అప్పుడే ఎందుకెళ్లి పోయారు.
....
పైన సూత్రధారి మిమ్మల్ని త్వరగా వచ్చేయ్ అనుంటాడు
ఎందుకంటే..
మీరు సొట్టబుగ్గలతో అమాయకంగా ఆప్యాయంగా నవ్వుతూ
పలకరించడం.. అంటే దేవుడికి కూడా చాలా ఇష్టమేమో...
......
సమయం: సాయంత్రం 8 గంటలు
నటి సుజాత.. అనాలంటే ఎవ్వరికైనా కష్టమే
ఎందుకో.. సుజాతమ్మను.. కేవలం నటిగా మాత్రమె చూడలేము
.......
నేనయితే.. చెడ్డీలు వేసుకునే వయసు నుంచి మేడమ్ సుజాత సినిమాలు చూస్తూ వచ్చాను.ఎప్పుడో.. ఊహ తెలిసీ తెలియని వయసులో చూసిన గోరింటాకు, సుజాత సినిమాలు ఇప్పటికీ మదిలో నుంచి సుజాతగారి రూపాన్ని చెక్కు చెదరనివ్వడంలేదు.
....నాకు బాగా గుర్తు..
సంగీతమంటే వల్లమాని ప్రేమ కనుక
సుజాత సినిమాలోని
`` ఉంగరం పడిపోయింది.. పోతేపోనీ
కొంగుజారి పోయింది.. పోతే పోనీ..
ఉంగరం పడిపోయినా.. కొంగుజారి పోయినా...
హృదయం మాత్రం పదిలం పదిలం... ``
ఈ పాట.. సుమారు ముప్పయేళ్ళుగా
ఏదో ిఒక సమయంలో గొంతులో దొర్లుతూనే ఉంది..ఇంకా సుజాత గారి గురించి ఏం చెప్పాలి..
ఆవిడది...
మా అమ్మ వయసని చెప్పాలని ఉంది
మా అమ్మ, పక్కింటి పిన్ని, ఆంటీ వీళ్ళంతా..
ఇంట్లో మగవాళ్ళకు తెలియకుండా
గోరింటాకు, కార్తీక దీపం వంటి సుజాత మేడం సినిమాలెన్నో
చూశారని చెప్పాలని ఉంది.
ఇంకా..
మా భార్య అంజు..
మొన్నా మధ్య.. నర్తకి, గాయని స్మితా మాధవ్ నటిస్తున్న `వెంగమాంబ`లో
సుజాత గారితో కలిసి నటించింది.. అని గర్వంగా చెప్పాలని ఉంది..
సుజాతమ్మ అప్పుడే ఎందుకెళ్లి పోయారు.
....
పైన సూత్రధారి మిమ్మల్ని త్వరగా వచ్చేయ్ అనుంటాడు
ఎందుకంటే..
మీరు సొట్టబుగ్గలతో అమాయకంగా ఆప్యాయంగా నవ్వుతూ
పలకరించడం.. అంటే దేవుడికి కూడా చాలా ఇష్టమేమో...
......
సమయం: సాయంత్రం 8 గంటలు
Monday 4 April 2011
My Nano
నానో కార్ తో
ప్రయాణం
ఓ అందమైన.. అనుభవం
...
నానో కొని.. నెల అయ్యింది
రెండు వేల కిలోమీటర్లు పైగా తిరిగాను..
బాగుంది..
Sorry.. Akshya
ఎప్పటికీ పొత్తిళ్ళలోనే పెట్టుకోండి
మీ బిడ్డ.. మురిపాల బిడ్డ
అమ్మ..నవమాసాలు మోసిన బిడ్డ
పాలబుగ్గల పసివాడని చూసి మురిసిపోండి
గుండెలపై అదుముకుని.. కల్లబొల్లి కథలు చెప్పండి
గుడికి పంపండి
బడికి పంపండి
పిజ్జా, బర్గర్లు కొనివ్వండి
మారం చేస్తే బోల్డన్ని బొమ్మల్ని కొనివ్వండి
....
మీ బిడ్డ మానవాతీతశక్తికి ప్రతి రూపంగా ఫీలవ్వకండి
చిట్టి చేతులతో ఇటుకలు మోయించకండి
బుల్లి చేతులతో ఇటుకలు పగలగొట్టించకండి
తిక్క విన్యాసాల పేరుతో
లేత గుండెలపై నాపరాళ్ళు పగలగొట్టకండి
మీ బిడ్డ.. ఎప్పటికీ
పొత్తళ్ళలోని బిడ్డే
మీరు కన్న బిడ్డ..
`శతమానం భవతీ` అని దీవించాల్సింది మీరే
మీరు కన్నందుకు
మీ ప్రేమను పంచినందుకు
...........
సారీ.. అక్షయ
వి మిస్ యూ
వి మిస్టేకెన్ ఎబౌట్ యూ..!
.....................
స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా అక్షయ అనే అయిదో తరగతి విద్యార్ధి గుండెలపై కరాటే పేరుతో బండరాళ్ళు మోది పసి ప్రాణం ఉసురు పోసుకున్న సంఘటనకు స్పందన ఇది.... 040411మీ బిడ్డ.. మురిపాల బిడ్డ
అమ్మ..నవమాసాలు మోసిన బిడ్డ
పాలబుగ్గల పసివాడని చూసి మురిసిపోండి
గుండెలపై అదుముకుని.. కల్లబొల్లి కథలు చెప్పండి
గుడికి పంపండి
బడికి పంపండి
పిజ్జా, బర్గర్లు కొనివ్వండి
మారం చేస్తే బోల్డన్ని బొమ్మల్ని కొనివ్వండి
....
మీ బిడ్డ మానవాతీతశక్తికి ప్రతి రూపంగా ఫీలవ్వకండి
చిట్టి చేతులతో ఇటుకలు మోయించకండి
బుల్లి చేతులతో ఇటుకలు పగలగొట్టించకండి
తిక్క విన్యాసాల పేరుతో
లేత గుండెలపై నాపరాళ్ళు పగలగొట్టకండి
మీ బిడ్డ.. ఎప్పటికీ
పొత్తళ్ళలోని బిడ్డే
మీరు కన్న బిడ్డ..
`శతమానం భవతీ` అని దీవించాల్సింది మీరే
మీరు కన్నందుకు
మీ ప్రేమను పంచినందుకు
...........
సారీ.. అక్షయ
వి మిస్ యూ
వి మిస్టేకెన్ ఎబౌట్ యూ..!
.....................
Jagaaram..
జాగారం
...
నింగిలో..
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నక్షత్రాలతో చేయీ చేయీ కలపాలని ఉంది
ఉల్లిపొరలాంటి చల్లని మేఘంపై
కాసేపు ఉయ్యాలూగాలని ఉంది
ఆనక..
చందమామా వచ్చా..
జాబిల్లి వచ్చా.. అని
అమ్మ నేర్పిన పాటను..
జాబిలమ్మకే వినిపించాలని ఉంది
........
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నాలో నేను మాట్లాడుకోవాలి
ఆనక.. అలసిపోయి
కునుకుతీయాలి
రాత్రి జాగరపు సంగతుల్ని
పగలంతా నెమరు వేసుకోవాలి
...
నింగిలో..
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నక్షత్రాలతో చేయీ చేయీ కలపాలని ఉంది
ఉల్లిపొరలాంటి చల్లని మేఘంపై
కాసేపు ఉయ్యాలూగాలని ఉంది
ఆనక..
చందమామా వచ్చా..
జాబిల్లి వచ్చా.. అని
అమ్మ నేర్పిన పాటను..
జాబిలమ్మకే వినిపించాలని ఉంది
........
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నాలో నేను మాట్లాడుకోవాలి
ఆనక.. అలసిపోయి
కునుకుతీయాలి
రాత్రి జాగరపు సంగతుల్ని
పగలంతా నెమరు వేసుకోవాలి
Sunday 3 April 2011
Ugaadi.. shubhakaram
..... మిత్రుడు శింగరాజు మాధవ్ సాక్షిలో రాసిన ugaadi ఆర్టికల్.. నాకు బాగా నచ్చింది.. మీరు చదవండి.. maadavji అద్భుతమైన రాతగాడు మంచివాడు.. మనసున్నవాడు ఇక చదవండి నేను శుభ ఖరం | |
|
We love Sparrow
పిచుక......
పిచుక. ఈ పేరు వింటేనే.. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి అనుభవం ఏదో ఒకటి గుర్తురాక మానదు. పొద్దు పొడవక
ముందే ఇంటి చూరిపై గుంపుగా వాలి.. కిచ కిచమంటూ మనల్ని నిద్రలేపిన మన ఊరి పిచుకలు గుర్తొస్తాయి.
ఆనక పొలంగట్టు పైనుంచి బిలబిలమంటూ ఎగురుకుంటూ వరికంకులపై వాలిన పిచుకలు మన మస్తిష్కంలో..
దృశ్యంగానూ మెరవొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో మన ఇంటి వాకిలి సాక్షిగా.. సందడి చేసిన పిచుకలు.. మన
నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతరిస్తున్నాయి. ఏవీ.. నిన్నా మొన్నటి దాకా
ఇంటి పెరట్లో, గొడ్ల చావిడ్లో, చెట్ల మధ్యలో ఎగురుతూ, గెంతుతూ.. సవ్వడి చేసిన పిచుకలు.. ఎక్కడా.. అని ఆరాతీసే
పరిస్ధితి నుంచి మేల్కొందాం. ఇప్పటికే పర్యావరణ వేత్తలు.. మరో కొన్నాళ్ళుపోతే... పుస్తకాల్లో మాత్రమే పిచుకల్ని బొమ్మలుగా.. చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి మేలేగానీ కీడు చేయని పిచుకలు.. ప్రజల వినియోగించే సెల్‌ఫోన్ వాటి టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల సంతానోత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. దీంతోపాటు.. పచ్చని పల్లెలన్నీ.. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. వేలెడంత పిచుకకు నిలువ నీడనిచ్చే పరిస్థితే సమాజంలో కరవవ్వడంతో.. ఇప్పడు పిచుకల మనగడ ప్రశ్నార్ధకంగా మారింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. పిచుక సవ్వడిని విన్నవాళ్ళు లేదా చూసిన వాళ్ళు. అరుదనే చెప్పాలి.ఈ క్రమంలో పర్యావరణ ప్రేమికులు.. పిచుకల జాతి అంతరించడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నారు. ఈ
నేపథ్యంలో పిచుకల పరిరక్షణ విషయంలో ఇప్పడిప్పుడే అనేక జీవకారుణ్య సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇదొక మంచి ప్రయత్నంగా మనమంతా సహకరించాలి.మనింటి పిల్లలు పిచుక అంటే ఎలా ఉంటుంది.. అని ప్నశ్నించకుండా ఉండాలంటే.. మనకున్నంతలో వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే. మనింటి వాకిట్లో గుప్పెడు గింజలు, కాస్త పచ్చదనం ఉండేలా ప్రయత్నిస్తే.. కచ్ఛితంగా పిచుకల కిలకిల రావాలు.. వినొచ్చు. ఒక్కొక్కటి చేరిన పిచుకల సమూహంలో మునిగి కాసేపు సేదతీరనూ వచ్చును.
పిచుక. ఈ పేరు వింటేనే.. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి అనుభవం ఏదో ఒకటి గుర్తురాక మానదు. పొద్దు పొడవక
ముందే ఇంటి చూరిపై గుంపుగా వాలి.. కిచ కిచమంటూ మనల్ని నిద్రలేపిన మన ఊరి పిచుకలు గుర్తొస్తాయి.
ఆనక పొలంగట్టు పైనుంచి బిలబిలమంటూ ఎగురుకుంటూ వరికంకులపై వాలిన పిచుకలు మన మస్తిష్కంలో..
దృశ్యంగానూ మెరవొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో మన ఇంటి వాకిలి సాక్షిగా.. సందడి చేసిన పిచుకలు.. మన
నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతరిస్తున్నాయి. ఏవీ.. నిన్నా మొన్నటి దాకా
ఇంటి పెరట్లో, గొడ్ల చావిడ్లో, చెట్ల మధ్యలో ఎగురుతూ, గెంతుతూ.. సవ్వడి చేసిన పిచుకలు.. ఎక్కడా.. అని ఆరాతీసే
పరిస్ధితి నుంచి మేల్కొందాం. ఇప్పటికే పర్యావరణ వేత్తలు.. మరో కొన్నాళ్ళుపోతే... పుస్తకాల్లో మాత్రమే పిచుకల్ని బొమ్మలుగా.. చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి మేలేగానీ కీడు చేయని పిచుకలు.. ప్రజల వినియోగించే సెల్‌ఫోన్ వాటి టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల సంతానోత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. దీంతోపాటు.. పచ్చని పల్లెలన్నీ.. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. వేలెడంత పిచుకకు నిలువ నీడనిచ్చే పరిస్థితే సమాజంలో కరవవ్వడంతో.. ఇప్పడు పిచుకల మనగడ ప్రశ్నార్ధకంగా మారింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. పిచుక సవ్వడిని విన్నవాళ్ళు లేదా చూసిన వాళ్ళు. అరుదనే చెప్పాలి.ఈ క్రమంలో పర్యావరణ ప్రేమికులు.. పిచుకల జాతి అంతరించడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నారు. ఈ
నేపథ్యంలో పిచుకల పరిరక్షణ విషయంలో ఇప్పడిప్పుడే అనేక జీవకారుణ్య సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇదొక మంచి ప్రయత్నంగా మనమంతా సహకరించాలి.మనింటి పిల్లలు పిచుక అంటే ఎలా ఉంటుంది.. అని ప్నశ్నించకుండా ఉండాలంటే.. మనకున్నంతలో వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే. మనింటి వాకిట్లో గుప్పెడు గింజలు, కాస్త పచ్చదనం ఉండేలా ప్రయత్నిస్తే.. కచ్ఛితంగా పిచుకల కిలకిల రావాలు.. వినొచ్చు. ఒక్కొక్కటి చేరిన పిచుకల సమూహంలో మునిగి కాసేపు సేదతీరనూ వచ్చును.
Saturday 2 April 2011
Thursday 31 March 2011
Subscribe to:
Posts (Atom)