Friday 8 April 2011

ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు
దేశాన్ని ఊపుతున్నాడు..
ఒకే ఒక్కడు..
కోట్ల ప్రజల ఆలోచల్ని ప్రజ్వలింప చేస్తున్నాడు
..........
ఒకే ఒక్కడు..
అవినీతిపై పోరాడలేక రాజీపడిన
ఉక్రోషాన్ని....ఆవేశాన్ని
గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేలా చేస్తున్నాడు
............
ఒకే ఒక్కడు
జాతి పౌరుషాన్ని
ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడేలా పుణ్యం కట్టుకున్నాడు
...
నిన్నా మొన్నటి దాకా
అవినీతినెదిరించే మొనగాడే లేడాయే..
ఇదిగో..
72 ఏళ్ళ యువకుడొచ్చాడు..
మనందరికీ కొండంత స్ఫూర్తినిచ్చాడు..
...
ఖబడ్డార్.. అవినీతి రాక్షసి
ఖబడ్జార్..
ఇప్పడు
కోట్ల ప్రజల భారతావనిలో..
ఇంటికొక `అన్నా హజారే` ఉద్భవించాడు
నిన్ను తరిమి తరిమి కొట్టడానికి
....
జిందాబాద్ అన్నా హజారే
ఇక నువ్వంటే అవినీతికి బేజారే..

2 comments:

  1. అవినీతి రాకాసి నీపై తీరబోతుంది మా కసి!

    ReplyDelete
  2. మేడమ్..
    మీ కామెంట్.. సంతోషాన్నిచ్చింది.. మీ బ్గాగ్‌లోకి వెళ్ళాను.. ఆసాంతం చదవలేదుగానీ... ఇక మీదట చదువుతాను... అప్పుడప్పుడు నా బ్లాగ్ చూసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు...

    ReplyDelete