Thursday 25 December 2014


::బంధాలు::
అమ్మా నాన్నల ధ్యాసే లేకపాయే!
అన్న, తమ్ముడి ఊసే లేకపాయే!
అక్క, చెల్లి మాటే రాకపాయే!
..
చిన్నాన్న, పెదనాన్న ఎక్కడో!
అత్త, మావయ్య ఎక్కడో!
..
పెద్దమ్మ, పిన్నమ్మ..
పెద తాతయ్య, చిన తాతయ్య
మేనమామ, మేనకోడలు
ఆ వరసలేవి?
ఆ పలకరింపులేవి?
..
పుట్టి పెరిగిన ఊరి బంధం లేదు
ప్రాణంపెట్టే రక్త సంబంధాలు లేవు
..
రానురాను..
బతుకులు ఒంటరవుతున్నాయ్!
బంధాలు నల్లపూసవుతున్నాయ్!!
-25-12-14 (నల్లపూస-1)

Sunday 7 December 2014


కొలువులు అనేకం 
కొన్ని కలుపుగోలుతనాలు మరికొన్నికలగలపుతనాలు ఒక్కో చోట.. అందంగా లభించే ముత్యపు చిప్పల్లోని స్నేహాలు మరింకో చోట.. కొంతకాలం బంధాలు మరికొంతకాలం.. అరమరకలు లేని స్నేహాలు..! కొంత గురుసాంగత్యం మరికొంత అన్నదమ్ముల అనుబంధంజీవిత పోరాటంలో..చేసే కొలువులు మారుతుంటాయి పరిచయ రూపాలు మారుతుంటాయి బంధాల్లోని అనుభవాలు మాత్రం అవే విడిచిన నేలపై వదిలిపెట్టిన పరిమళాలను మరోసారి వెదుక్కుంటూ వెళ్ళడం కష్టమే కానీ, అప్పుడప్పుడు.. ఆ వాకిట.. ఆ అనుభవాలు మిగిల్చిన మనసుల్ని, మనుషుల్నిమర్చిపోవడం సాధ్యం కాదు కొలువులు అనేకం గుప్పెడంత స్నేహం అందించిన.. మనుషులు, మనసులు మాత్రం పరిమితం..!! చేసిన కొలువుల్లో మనసులో మనసై నాతో మసిలిన స్నేహసుమాలకు ప్రేమతో....
- 19 ఫిబ్రవరి, 2014