Thursday 7 April 2011


అవినీతిపై శంఖారావం
ఇది అన్నా హజారే.. వాదం
నీతిమాలిన కుక్కలు
పందుల చేసిన తప్పులతో..
ఎన్నో ఏళ్ళుగా.. అవినీతి..
ఎన్నో వికృత రూపాలను దాల్చి
అవినీతి అనేది ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది
....
కనీసం అవినీతిపై పోరాటం చేయడానికైనా
ఒక్కరైనా మనుషులు మిగలనంతగా
మన నరనరాల్లో ఇంకిపోయింది..
కలిసిపోయింది..
అవినీతిని నమ్ముకున్న వారిని
ప్రోత్సహించడానికి
అలవాటయి పోయింది
...
అవినీతిని నమ్ముకుంటేగానీ
జీవితంలో రెండడుగులు వేయలేవేమో అన్నంతగా
అవినీతి.. అల్లుకుపోయింది..
ఇప్పటికైనా
అన్న హజారే‌ పిలుపునందుకుందాం
అవినీతి ఏ రూపంలో ఉన్నా..
మక్కెలు విరగ్గొడదాం..

1 comment:

  1. అద్భుతం ఎన్నోఏళ్ళుగా సగటుపౌరుడి ఆవేదన మీ అక్షరాల్లో కనిపిస్తుంది. అవినీతిని ఎలా ఎదిరించాలో తెలియక మనకెందుకులే... అని ఊరుకున్నవారికి అవినీతిపై గళమెత్తాలనుకొనే వారికి అన్నాహజారే దీక్ష చక్కని వేదిక రియల్లీ హాట్సాఫ్ అన్నా...మీవెంటే మేముంటాం..

    ReplyDelete