Wednesday 1 June 2011

ఒంటరి పక్షి


ఒంటరి పక్షి
కూతలెవ్వరికెరుక
దిక్కులు పిక్కుటిల్లేలా
తెలిసిన భాషలో కూస్తూనే ఉంది
పాపం పక్షి భాష
ఎవరికెరుక
....

వేళాపాలా లేదు
పొద్దుపొడవక ముందే
ఆవలిస్తుంది
ఒంటరి పక్షి
కూతలెవ్వరికెరుక
...

కూసి కూసి కూత ఆగింది
నాలుగు నూకల్ని
చూసింది
సంతోషంతో
ఒంటరి పక్షి
కూత ఆపి
కిలకిల నవ్వింది