Sunday 9 December 2012

కూరుకు పోయా

ప్రేమ లోతుల్లో
 .....................

నీ ఊహల శిఖరాగ్రాన నిలబడాలని ఉన్నా..
ఇప్పటికే నీ ప్రేమ లోతుల్లో కూరుపోయాగా?
.....

Saturday 8 December 2012

ఎటైనా వెళ్ళేందుకు

ఎటైనా వెళ్ళేందుకు
...............................

నాలుగు కూడళ్ళో నిలబడింది దారితెలియక కాదు
ఎటైనా వెళ్ళేందుకు అనుకూలమనే.
............ 09-12-2012

Friday 7 December 2012

ధీశాలిని

నిన్ను కోల్పోయే త్యాగశీలిని కాదు
నీ ప్రేమకై జీవితాన్ని ధారపోసే ధీశాలిని

.............. 07-12-2012(రాత్రి 11.30)

||నీ సేవకుడ్నే||

 ||నీ సేవకుడ్నే||

ఏమిటి??
మూతి బిగింపు
...
అందాల రాశివి
అపురూప సౌందర్యానివి
భూలోక అప్సరసవు..
..
అతిలోక సుందరివి
అని పొగడలేదనేకదా
ఆ మూతి బిగింపు
....
అవన్నీ
మాటల గారడీలు మాత్రమే
..
అసలు
నాకు నువ్వు ఎవరో తెలుసా?
..
నా హృదయాన్ని
ఏలే రాకుమారివి
నేను మాత్రం
నీ సేవకుడ్నే

నిరీక్షణ 
నిన్నా మొన్నటి వరకూ
నా హృదయాన్ని గెలిచే మరో హృదయం
ఎక్కడా అని ఎదురు చూశాను..
...
నువ్వే అని తెలిసిన తర్వాత
నా హృదయం నీదేనని చెప్పడానికి..
మళ్లీ నిరీక్షణేనా...

  06-12-2012,  12.13

Wednesday 5 December 2012

పెదాలు వణుకుతున్నాయ్

పెదాలు వణుకుతున్నాయ్
 నువ్వు వస్తావని తెలియక
ఇదిగో ఇలా వట్టి చేతులతో
స్థానువయ్యాను.
..
ఇదిగోచూడు
నా పెదాలు వణుకుతున్నాయ్
నీకు బహుమతిగా
ఏమివ్వాలో తెలియక
గుండె బారమవుతుంది.
.....
ఎందుకు ఆ గుడెనే
నీ ముంగిట పరిచి
వెన్నెల రాత్రంతా
నీతో కబుర్లు చెప్తాలని ఉంది
...
ఇదిగో చూడు
ఇప్పటికీ
నా వణికే పెదాలు
నన్ను మరింత వణికిస్తున్నాయ్
...
వెన్నలమ్మ సాక్షిగా
నీతో ఊసులాడాలని
ఆనక జాబిలమ్మను
నీకు కానుకివ్వాలని
...
ఇదిగో చూడు
ఇప్పటికీ నా పెదాలు వణుకుతున్నాయ్
..
పెదవిదాటని
మాటనేదో చెప్పాలని
ఆశపడుతున్నాయ్.

నా గుండె వాకిట తలుపు


నా గుండె వాకిట తలుపు
వేసింది వేసినట్టే ఉంది
......
కలలో కూడా నిన్ను
కలవరించకూడదని
అదిగో కిటికీ చాటునుంచి
మిణుకు మిణుకంటూ
నన్నే చూస్తున్న చక్కని చుక్కపై
గట్టిగా ఒట్టే పెట్టుకున్నా
.....
ముసురుతున్న
చల్లగాలు తెచ్చే నీ జ్ఞాపకాన్ని సైతం
దరిచేరనీయకూడదని
దుప్పటి ముసుగూ వేసుకున్నా.
.....
హమ్మయ్య..
ఇక ఈ రాత్రి నీ ఊసులేకుండా
నిద్రలోకి జారుకోవచ్చు.
....
కంటి పాపలు మూతపడ్డాయ్
క్షణకాలం గడిచిందో లేదో
కనురెప్పల మాటున ఏదో అలజడి
అదిగో..
నీ రూపం గట్టిగా హత్తుకుంది.
ఎక్కడికీ పారిపోకుండా
బంధీని చేసింది
...........

|| నీ ఇష్టం ||

 || నీ ఇష్టం ||

నిశ్చలంగా మనసును
ఒకచోట ఉంచాలని ప్రయత్నిస్తూనే
ఉన్నాను.
ఏం లాభం? స్థిరంగా ఉంటేగా.
..
మనసు
వానరంలా గంతులేస్తుంది
మళ్లీ మరో తిరోగమనం కోసం
వేచి చూడాలేమో?
..
ఏమాయ చేవావో ఏమోగానీ
నింగి వైపుకి దూసుకెళ్ళి
నక్షత్ర సముదాయాన్ని
నీకోసం తెంచుకురావాలని ఉంది
...
తూరుపు దిక్కునకేగి
వెలిగే సూర్యడ్ని అందుకోవాలని ఉంది
...
వెండి మబ్బుల్లోకి
చొరబడి
చల్లని మంచు తునక తెంపాలని ఉంది
....
ఇదివరకెప్పుడూ
చలనంలేని ఈ మనసులో
ఇప్పుడే లేనిపోని అలజడులెందుకో
నీకేమైనా తెలుసా
...
..
ఏమాయ చేశావో ఏమోగానీ
నిన్నటి వరకూ
చెట్టుపుట్ట తిరిగిన నేను
ఇప్పుడు మాత్రం
నీకోసం పూవనంలో
గులాబీలు ఏరుకురావాలనిపిస్తుంది
....
నీకోసం నా చేతిలోని
ఎర్రని గులాబీలు
వేచిచూస్తున్నాయి.
అస్వాదిస్తావో
ముళ్లులా గుచ్చుకుంటావో
నీ ఇష్టం.
.......... 06-12-2012, (తెల్లవారు జాము 3.18)