Wednesday 6 April 2011

సూత్రధారి రమ్మన్నాడా....
నటి సుజాత.. అనాలంటే ఎవ్వరికైనా కష్టమే
ఎందుకో.. సుజాతమ్మను.. కేవలం నటిగా మాత్రమె చూడలేము  
....... 
నేనయితే.. చెడ్డీలు వేసుకునే వయసు నుంచి మేడమ్ సుజాత సినిమాలు చూస్తూ వచ్చాను.
ఎప్పుడో.. ఊహ తెలిసీ తెలియని వయసులో చూసిన గోరింటాకు, సుజాత సినిమాలు ఇప్పటికీ మదిలో నుంచి సుజాతగారి రూపాన్ని చెక్కు చెదరనివ్వడంలేదు.
....
నాకు బాగా గుర్తు..
సంగీతమంటే వల్లమాని ప్రేమ కనుక
సుజాత సినిమాలోని
`` ఉంగరం పడిపోయింది.. పోతేపోనీ
కొంగుజారి పోయింది.. పోతే పోనీ..
ఉంగరం పడిపోయినా.. కొంగుజారి పోయినా...
హృదయం మాత్రం పదిలం పదిలం... ``
ఈ పాట.. సుమారు ముప్పయేళ్ళుగా
ఏదో ిఒక సమయంలో గొంతులో దొర్లుతూనే ఉంది..
ఇంకా సుజాత గారి గురించి ఏం చెప్పాలి..
ఆవిడది...
మా అమ్మ వయసని చెప్పాలని ఉంది
మా అమ్మ, పక్కింటి పిన్ని, ఆంటీ వీళ్ళంతా..
ఇంట్లో మగవాళ్ళకు తెలియకుండా
గోరింటాకు, కార్తీక దీపం వంటి సుజాత మేడం సినిమాలెన్నో
చూశారని చెప్పాలని ఉంది.
ఇంకా..
మా భార్య అంజు..
మొన్నా మధ్య.. నర్తకి, గాయని స్మితా మాధవ్ నటిస్తున్న `వెంగమాంబ`లో
సుజాత గారితో కలిసి నటించింది.. అని
గర్వంగా చెప్పాలని ఉంది..
సుజాతమ్మ అప్పుడే ఎందుకెళ్లి పోయారు.
....
పైన సూత్రధారి మిమ్మల్ని త్వరగా వచ్చేయ్ అనుంటాడు
ఎందుకంటే..
మీరు సొట్టబుగ్గలతో అమాయకంగా ఆప్యాయంగా నవ్వుతూ
పలకరించడం.. అంటే దేవుడికి కూడా చాలా ఇష్టమేమో...
......
సమయం: సాయంత్రం 8 గంటలు

2 comments:

  1. అన్నా చాలా బాగుంది.... సుజాత మేడం నటించారంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆమే జీవించారు. అందుకే అభిమానుల మనసుల్లో ఆమె చిరకాలం నిలిచి పోతారు. ఆమె మరణ వార్త వినగానే... నిజంగానే ఆ జగన్నాటక "సూత్రధారి"పై కాస్త కోపం వచ్చింది. చెరగని చిరునవ్వుతో ఎప్పుడూ అభిమానులను అలరించిన సుజాత మేడం ను చూసి ఆయనకు కన్నుకుట్టి ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఈ రోజు వరకే ఆమె రాతను రాసి ఉంటాడు...
    నీ మిత్రుడు...
    రాజ్‌ కుమార్‌....

    ReplyDelete
  2. ధ్యాంక్యూ.. బ్రదర్
    నటి సుజాతగారిపైన నీ వ్యక్తిగత అభిప్రాయం.. బాగుంది
    ఇలాగే.. ఇక మీదట నా బ్లాగ్‌పైన స్పందన తెలియజేస్తావని ఆశిస్తూ...
    గంగాధర్ వీర్ల

    ReplyDelete