Saturday 16 April 2011

అనితరం..


నువ్వేం సాధించావురా..
అని అడిగితే..
ఏం సాధించాలి
అమ్మ కడుపున పుట్టాం అది చాలదా..
అనే చెప్తాను..
అమ్మ ప్రేమ అనితరం
అమ్మ ప్రేమ ఆశీర్వాదం
ఇంతకు మించి ఏంకావాలి
ఎవరికైనా
*****
*****
చాలా ఏళ్ళ క్రితం
సుమారు 2002_2003 మధ్య కావచ్చు
ప్రజాశక్తిలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పనిచేస్తున్నాను..
..



యాధాలాపంగా పెన్సిల్‌తో అలా.. అలా గీసి
తర్వాత బ్రషింగ్ చేశాను..
****
పాత పుస్తకాలు తిరిగేస్తుంటే
అమ్మ బొమ్మ మళ్ళీ భద్రంగా నా దగ్గరకొచ్చింది
...
..
దొరికిన ఈ అమ్మ బొమ్మకు
నా పైత్యాన్ని ఫొటోషాప్ రంగుల రూపంలో
కాస్త అద్ది.. ఇదిగో ఇలా తయారు చేశానన్నమాట

4 comments:

  1. ధన్యవాదాలు గీతిక గారు.. వీలైనప్పుడు.. కాస్త నా బ్లాగ్ చూస్తూ ఉండండి
    తగిన సలహాలు ఇవ్వండి

    ReplyDelete
  2. అమ్మ ప్రేమ అనిర్వచనం ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది.మీ కార్టూన్ చాలా బాగుంది.

    ReplyDelete
  3. చాలా బాగుంది మీ పైంట్ .నిజంగా అమ్మ ప్రేమ గురించి ,అమ్మ గురించి ఎవరెన్ని రకాలుగా రాసినా బాగుంటుంది.

    ReplyDelete