Wednesday 11 May 2011

నీ నవ్వులో


నీ నవ్వులో
ఏముందో ఏమోగానీ
...
కూసింత నావైపు చూసి
కాసింత నవ్వేవో లేదో
హనుమంతుడినై పోతున్నాను
...
సముద్రాన్ని రెండుగా
చీల్చుకుంటూ
నీ దగ్గరకొచ్చేంత
శక్తి ఆవరిస్తుంది
...
ప్రేమకు పరాకాష్ట
త్యాగం కాదేమో
ధైర్యమే కదూ..?

1 comment:

  1. బాగుందండీ మీ చిన్ని కవిత.

    ReplyDelete