Saturday 30 April 2011

మేడే.. ఈనాడే

ప్రపంచపు నలుదిక్కుల నీవు
ప్రపంచ గమనానివి నీవు
ఉప్పెంగె గీతం నీవు
ఆకాశానికి నిచ్చెన నీవు
.......
అభివృద్ధికి వెలుగుల రేఖవు నీవు
అభ్యుదయానికి కాంతి నీవు
.....
మానవాళి పాటవు నీవు
మానవత్వానికి బాటవు నీవు
......
శ్రమకు నిర్వచనం నీవు
నవతకు శుభోదయం నీవు
....
మండుటెండలో
స్వేదం చిందే కర్తవ్యానివి నీవు
శ్రామికుడు నీవు
కార్మికుడు నీవు
.....
ప్రియతమ కార్మికులారా
మరో ప్రపంచం కోసం
సంఘటితంగా ఉద్యమిద్దాం
.......

Tuesday 26 April 2011

ఇద్దరిదీ ఒకే ఊరు

ఇద్దరిదీ ఒకే ఊరు
ఇద్దరిదీ ఒకే వీధి
ఇద్దరు చదివిందీ ఒకే బడి
ఇద్దరు నడిచింది ఒకే నేల
ఇద్దరు మొక్కిందీ ఒకే దేవుడు
కానీ..
వాడు నాకంటే పైకి
ఎదిగిపోతున్నాడని నాకు మహా కుళ్ళు..
వాడికీ అంతే
నేనెక్కడ వాణ్ణి మించిపోతానేమోనని
....
ఇద్దరిదీ ఒకే కొలువు
కానీ ఎప్పుడూ మాట్లాడుకోం
వాడిల్లే దారిలో నేను
నేను వెళ్ళేదారిలో వాడు
గోతులు తవ్వుకుంటుంటాం
...
మేం నీతిమంతమైన
అక్షరాలు తెలిసిన మేధావులం
ఎదుటివాడికి నీతులు చెప్పే
అంబోతులం

Saturday 23 April 2011

చరణ కమలాలకు ....


దివ్యజ్యోతి రూపంలోకి
మారిన అమృతమూర్తి
భౌతికంగా మానవాళికి
దూరంగా వెళ్ళినాగానీ..
అచంచలమైన మానవతావాదాన్ని
ప్రపంచానికి అందించిన
బాటను ఎవ్వరూ
దాటిపోలేరు.
దూరంకాలేరు
బాబా.. ఓ సేవానిరతి
బాబా.. ఓ అద్వితీయ శక్తి
బాబా.. కోట్ల ప్రజల విశ్వాసం
బాబా.. నిరంతర గమనం
బాబా.. ఓ ఆత్మవిశ్వాసం
బాబా..
మనల్ని నడిపించే శక్తి
.......
....
చరణ కమలాలకు
అంజలి ఘటిస్తూ......

Friday 22 April 2011

అద్దం ముందు

అద్దం ముందు
నిజంగా వంకర్లు పోయేది
మగవాళ్ళే..
నాతో సహా..

ఈనాడు‌లో

ఈనాడు‌లో పనిచేసేటప్పుడు.. ఆడవారు అబలలు కాదు.. కండలు తిరిగిన మగవాళ్లను సైతం ధైర్యంగా చిత్తుచేసే మహరాణులు కూడా అనే అర్ధంలో నగరంలో పెరుగుతున్న మహిళా యోగా సెంటర్లు‌పై సిటీ పేజీల కోసం ఆర్టికల్ రాశాను. నేను రాసిన ఆర్టికల్‌కు నేనే వేసిన  బొమ్మనే ఆ.. ఆర్టికల్‌కు వాడుకున్నారు.. ఆ బొమ్మను భద్రంగా దాచుకోవడంవల్ల.. ఇప్పడు ఇదిగో ఇలా బ్గాగులో దర్శనం ఇచ్చింది

Thursday 21 April 2011

శబ్దాలు మారుతున్నాయ్

శబ్దాలు మారుతున్నాయ్
నిశ్శబ్దం రాను రాను
ఘొల్లుమంటుంది.
.....
ఆకలి అర్తనాదాలూ...
మూగబోతున్నాయ్
....
వలసలు
వరస క్రమంలో
పట్నాలకు క్యూ కడుతూనే ఉన్నాయి
...
పల్లెలు.. తోడులేక
ఘొల్లుమంటున్నాయి
...
పట్నంలోని బతుకూ...
గూడులేక
నిశిరాత్రి వరకూ
బువ్వకష్టాలు పడుతూనే ఉంది
....
పల్లెలు
పట్నాలు..  రెండూ
మూగబోతున్నాయ్.
సారీ......
రోదిస్తున్నాయ్

Tuesday 19 April 2011

కాక్‌టైల్ మత్తులో

కాక్‌టైల్ మత్తులో జోగినట్టు
పొద్దంతా
గందరగోలపు సుడులు తిరుగుతోంది
దిక్కుమాలిన
ఆలోచనలు.. ఒకటీ
స్పష్టంగాలేవు
నిన్న ఎలాగోలా గడిచిందనే
ఆనందం.. క్షణపాటైనా ఉంటేగా
రెక్కలు కట్టుకుని మరీ
ఈరోజు..
ఏదో బద్ద శతృత్వం ఉన్నట్టు
సుడులు సుడులుగా
మెదడ్ని
తురుమేస్తుంది
...
ఇరానీ ఛాయ్ తాగినా
వదిలిపోని నిట్టూర్పు
వడగాలికే భయం పుట్టేంత
శ్వాషలో వేడిగాలులు
...
దేనికో వెదుకులాట
అడ్రస్ తెలిస్తే..
వెళ్లిపట్టుకోడానికి
...
వెదకాలి
పొద్దనక
రాత్రనక
జీవితమనక..

Monday 18 April 2011

కాలం తెలియని జ్ఞాపకం..


ఏదో జ్క్ష్ఞాపకం
కలలా వచ్చి పోతోంది
ఆనక
తడిమి చూస్తే
స్పష్టంకాని దృశ్యం
అలలై వెంటాడుతూనే ఉంది
...
ఎక్కడ
నీ చిరునామా?
చెబితే
గోరుముద్దలు తినిపిస్తా..
...
మళ్ళీ..
ఏజామునో కునుకుపాటు
ఈసారి..
నీ నడకల చప్పుడు..
...
మెలకువలోనూ
నువ్వెక్కడ? అని
అనలేక ఉండలేక పోతున్నాను
...
ఏదో జ్ఞాపకం
కాలం తెలియకుండా
వెంటాడుతూనే ఉంది
...

Sunday 17 April 2011

కాలం కరిగిపోతుంది


కాలం కరిగిపోతుంది
వేగంగా అడుగులెయ్యి
...
దీపం ఆరిపోకముందే
ఆశల్ని వెలుగించు
....
నిన్నా మొన్నటి స్నప్నాలేవో
కృంగదీయొచ్చుకాక
ధైర్యంగా నిలబడు
...
అసాధ్యమని
మనస్సును మరల్చకు
నీవు సాధిస్తావ్..
...
అదిగో
చెమట బిందువులు
నీ పక్షానే ఉన్నాయి
..
నువ్వు కష్టపడే మనిషివి
జయించు
ఒక తరాన్ని నీతో నడిపించు
...
పేదవాడివనుకోకు
పిడికిలి బిగించు.. సాధిస్తావ్
...


 

Saturday 16 April 2011

అనితరం..


నువ్వేం సాధించావురా..
అని అడిగితే..
ఏం సాధించాలి
అమ్మ కడుపున పుట్టాం అది చాలదా..
అనే చెప్తాను..
అమ్మ ప్రేమ అనితరం
అమ్మ ప్రేమ ఆశీర్వాదం
ఇంతకు మించి ఏంకావాలి
ఎవరికైనా
*****
*****
చాలా ఏళ్ళ క్రితం
సుమారు 2002_2003 మధ్య కావచ్చు
ప్రజాశక్తిలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా పనిచేస్తున్నాను..
..



యాధాలాపంగా పెన్సిల్‌తో అలా.. అలా గీసి
తర్వాత బ్రషింగ్ చేశాను..
****
పాత పుస్తకాలు తిరిగేస్తుంటే
అమ్మ బొమ్మ మళ్ళీ భద్రంగా నా దగ్గరకొచ్చింది
...
..
దొరికిన ఈ అమ్మ బొమ్మకు
నా పైత్యాన్ని ఫొటోషాప్ రంగుల రూపంలో
కాస్త అద్ది.. ఇదిగో ఇలా తయారు చేశానన్నమాట

Thursday 14 April 2011

సారీ చిత్రగారు


చిత్రగారి పాపకు హాయ్ చెప్పాను..
ఈ మాట అంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయ్.
*******
నాలుగైదేళ్ళ క్రితం మాట
చిత్రగారు... హైదరాబాద్‌లో కచేరి చేయడానికి భర్త, పాపతో కలిసి వచ్చారు. అప్పట్లో ఈటీవిలో పనిచేస్తున్నాను. చిత్రగారు సిటీ వస్తున్నారని తెలిసి మిగితా మీడియాకంటే ముందుగానే కలిసి ప్రత్యేక ఇంటర్వూ తేవాలని ప్లాన్ చేసుకున్నాను. అలా చిత్రగారిని కలిశాను.
నాలక్కీ ఏమిటంటే... నేను ఇలా హోటల్ గదికి చేరుకున్నానో... లేదో.. చిత్రగారికి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనట్టు ఫోనొచ్చింది.
నా ఆనందానికి అవదుల్లేవు.
అసలే చిత్రగారి ఇంటర్వ్యూ, పైగా పద్మశ్రీ వచ్చిన సందర్భం..
మేము కెమెరా.. లైట్స్ సెట్ చేసుకుంటున్న క్రమంలోనే చిత్రగారికి ఫోన్ల తాకిడి మొదలయ్యింది. అయినా చిత్రగారు కెమెరా ముందు కూర్చుని కమ్మగా మాట్లాడుతూ... సారీ పాట్లాడుతూ ఉన్నారు
******
మధ్యలో
ఓ బుల్లి పాప.. మళయాళ భాషలో ఏదో సవ్వడి చేసుకుంటూ చిత్రగారి వళ్లో వాలిపోయింది.
కెమెరా రికార్డింగ్ ఆపకుండానే మేమంతా ఆ ముచ్చట షూట్ చేసేశాం..
`ఈ కుట్టి మన దగ్గరుంటే ఇంటర్వ్యూ సాగదు.. ` అంటూ
పాప.. నందనను మరో రూంలోకి పంపబోయారు చిత్ర..
అప్పడే చిత్రగారి పాప నందనను మొదటిసారి చూశాను.. అదే ఆఖరుసారి కూడా.
అటు ఇటు రెండు పిలకలేసుకుని.. చాలా ముద్దుగా ఉంది.
హాయ్ అని చెప్పా.. అమాయకంగా నవ్వింది.
పాపలో.. దేవుడు కొంచెం అమాయక పాల్లు.. పోశాడనిపించింది
....
పాప గదిలో అల్లరి చేస్తుండగానే.. చిత్రగారు ఇంటర్వ్యూ పూర్తి చేశారు..
ఇంటర్వ్యూ పూర్తవ్వగానే.. గదిలో బంధించిన పాప బిలబలమంటూ బయటకొచ్చేసింది.
...
మరోసారి మేమంతా నందనకు హాయ్ చెప్పాము
అప్పడు నందన మూడేళ్లపాప
ఇప్పడు నందన ఎనిమిదేళ్ళ పాప
దేవుడు నందనకు అమాకపాల్లు ఎక్కువ పోశాడని ముందే చెప్పాగా..
మూడేళ్లప్పుడు ఎలా ఉందో..
ఎనిమిదేళ్ళప్పుడు కూడా అదే అమాకత్వం..
అందుకే నందన..
నీటిని ఓ నేస్తం అనుకుంది
..
సారీ నందన
నీకు తెలియదా?
నీకు నీటి గండం ఉందని..
.....
సారీ చిత్రగారు
మీరెప్పుడూ నవ్వుతూ ఉంటారు
నందన కోసం ఆ నవ్వును అలాగే కొనసాగించండి
నందన కోసం పూలపరిమళాల పాటలు ఇంకా ఇంకా అద్దండి
...
యిక్కడ నుంచి మీరు పాడే లాలిపాటల్ని
నందన కచ్ఛితంగా
అక్కడనుంచి వింటుంది
...
మీరు పాడే పాట రూపంలో
నందన
ఎప్పటికీ మీ వెంట ఉంటూనే ఉంటుంది
........
.......

Wednesday 13 April 2011

స్వాతి ముత్యం

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై కలర్ స్వాతి... 100% లవ్ సినిమాలో పాడిన `ఏస్వేర్ ప్లస్ బీ స్క్వేర్` పాట అదుర్స్..
పాటలు పాడటం అనేది.. అతీతమైన ప్రతిభగానే చెప్పాలి. యాంకర్, నటిగా అందరికీ తెలిసిన కలర్ స్వాతి.. నిజంగానే ముత్యంలాంటి అమ్మాయే..
.........

Tuesday 12 April 2011

నీ చూపు చాలు


మౌనం
అర్ధ అంగీకారం
చూపులు కలిశాయి
మాటలు కలిసాయి
పాటలూ పల్లవించాయి
ఇక నీ కరుణ కోసమే
నా నిరీక్షణ..
********
నేనేమడిగానని..
కూసింత నీ ప్రేమ
నీ చల్లని చూపు
అంతే.. ఈశ్వర..

Monday 11 April 2011

విసిరేయాలి

కడలి అంచులదాటి
పయనించాలి
ఆకాశాన వేలాడే
తారల్ని డీకొట్టాలి..
......
పైనుంచి..
భూలోకాన్ని కొలవాలి
ఆనక
దేవుడ్ని వెయ్యి కోట్లు అప్పు అడిగి
ఆ డబ్బంతా.. కిందనున్న పేదలకు
విసిరేయాలి..
సిగలో మల్లెపూలు
మెడలో ముత్యాల హారం
నవ్వితే.. నవరత్నాలు
పల్లెపట్టు చీర కొంగును
నడుముకు చుట్టి
ఉయ్యాలలూపే..
మా అమ్మ అందం
చందమామకే కుళ్ళింతట
దానికి నేనే బుల్లింత సాక్షమట.......

Sunday 10 April 2011

సంబరం


సంబరం..
నాలో నీవైన సంబరం
సుతిమెత్తని చేతులు
బుగ్గలు..
నిమిరాలనే సంబరం
....
పాలుగారే చెక్కిలిపై
నా ప్రేమను
శాశ్వతంగా
ముద్రించాలనే సంబరం

క్షణ కాలం అరవివ్వవా...


ఎంత సేపని
నీకూ... నాకు మధ్య
ఈ నిశ్శబ్దం
.........
ఒక్క క్షణపు కాలాన్ని
అరువిస్తావా....
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
నీ చెవిలో గుస గుసలు వినిపిస్తా..!

Friday 8 April 2011

ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు
దేశాన్ని ఊపుతున్నాడు..
ఒకే ఒక్కడు..
కోట్ల ప్రజల ఆలోచల్ని ప్రజ్వలింప చేస్తున్నాడు
..........
ఒకే ఒక్కడు..
అవినీతిపై పోరాడలేక రాజీపడిన
ఉక్రోషాన్ని....ఆవేశాన్ని
గుండెలు చీల్చుకుని బయటకు వచ్చేలా చేస్తున్నాడు
............
ఒకే ఒక్కడు
జాతి పౌరుషాన్ని
ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడేలా పుణ్యం కట్టుకున్నాడు
...
నిన్నా మొన్నటి దాకా
అవినీతినెదిరించే మొనగాడే లేడాయే..
ఇదిగో..
72 ఏళ్ళ యువకుడొచ్చాడు..
మనందరికీ కొండంత స్ఫూర్తినిచ్చాడు..
...
ఖబడ్డార్.. అవినీతి రాక్షసి
ఖబడ్జార్..
ఇప్పడు
కోట్ల ప్రజల భారతావనిలో..
ఇంటికొక `అన్నా హజారే` ఉద్భవించాడు
నిన్ను తరిమి తరిమి కొట్టడానికి
....
జిందాబాద్ అన్నా హజారే
ఇక నువ్వంటే అవినీతికి బేజారే..

Thursday 7 April 2011


అవినీతిపై శంఖారావం
ఇది అన్నా హజారే.. వాదం
నీతిమాలిన కుక్కలు
పందుల చేసిన తప్పులతో..
ఎన్నో ఏళ్ళుగా.. అవినీతి..
ఎన్నో వికృత రూపాలను దాల్చి
అవినీతి అనేది ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది
....
కనీసం అవినీతిపై పోరాటం చేయడానికైనా
ఒక్కరైనా మనుషులు మిగలనంతగా
మన నరనరాల్లో ఇంకిపోయింది..
కలిసిపోయింది..
అవినీతిని నమ్ముకున్న వారిని
ప్రోత్సహించడానికి
అలవాటయి పోయింది
...
అవినీతిని నమ్ముకుంటేగానీ
జీవితంలో రెండడుగులు వేయలేవేమో అన్నంతగా
అవినీతి.. అల్లుకుపోయింది..
ఇప్పటికైనా
అన్న హజారే‌ పిలుపునందుకుందాం
అవినీతి ఏ రూపంలో ఉన్నా..
మక్కెలు విరగ్గొడదాం..

Wednesday 6 April 2011

సూత్రధారి రమ్మన్నాడా....
నటి సుజాత.. అనాలంటే ఎవ్వరికైనా కష్టమే
ఎందుకో.. సుజాతమ్మను.. కేవలం నటిగా మాత్రమె చూడలేము  
....... 
నేనయితే.. చెడ్డీలు వేసుకునే వయసు నుంచి మేడమ్ సుజాత సినిమాలు చూస్తూ వచ్చాను.
ఎప్పుడో.. ఊహ తెలిసీ తెలియని వయసులో చూసిన గోరింటాకు, సుజాత సినిమాలు ఇప్పటికీ మదిలో నుంచి సుజాతగారి రూపాన్ని చెక్కు చెదరనివ్వడంలేదు.
....
నాకు బాగా గుర్తు..
సంగీతమంటే వల్లమాని ప్రేమ కనుక
సుజాత సినిమాలోని
`` ఉంగరం పడిపోయింది.. పోతేపోనీ
కొంగుజారి పోయింది.. పోతే పోనీ..
ఉంగరం పడిపోయినా.. కొంగుజారి పోయినా...
హృదయం మాత్రం పదిలం పదిలం... ``
ఈ పాట.. సుమారు ముప్పయేళ్ళుగా
ఏదో ిఒక సమయంలో గొంతులో దొర్లుతూనే ఉంది..
ఇంకా సుజాత గారి గురించి ఏం చెప్పాలి..
ఆవిడది...
మా అమ్మ వయసని చెప్పాలని ఉంది
మా అమ్మ, పక్కింటి పిన్ని, ఆంటీ వీళ్ళంతా..
ఇంట్లో మగవాళ్ళకు తెలియకుండా
గోరింటాకు, కార్తీక దీపం వంటి సుజాత మేడం సినిమాలెన్నో
చూశారని చెప్పాలని ఉంది.
ఇంకా..
మా భార్య అంజు..
మొన్నా మధ్య.. నర్తకి, గాయని స్మితా మాధవ్ నటిస్తున్న `వెంగమాంబ`లో
సుజాత గారితో కలిసి నటించింది.. అని
గర్వంగా చెప్పాలని ఉంది..
సుజాతమ్మ అప్పుడే ఎందుకెళ్లి పోయారు.
....
పైన సూత్రధారి మిమ్మల్ని త్వరగా వచ్చేయ్ అనుంటాడు
ఎందుకంటే..
మీరు సొట్టబుగ్గలతో అమాయకంగా ఆప్యాయంగా నవ్వుతూ
పలకరించడం.. అంటే దేవుడికి కూడా చాలా ఇష్టమేమో...
......
సమయం: సాయంత్రం 8 గంటలు

Monday 4 April 2011

My Nano

నానో కార్ తో
ప్రయాణం
ఓ అందమైన.. అనుభవం
...
నానో కొని.. నెల అయ్యింది
రెండు వేల కిలోమీటర్లు పైగా తిరిగాను..
బాగుంది..





Sorry.. Akshya


ఎప్పటికీ పొత్తిళ్ళలోనే పెట్టుకోండి
మీ బిడ్డ.. మురిపాల బిడ్డ
అమ్మ..నవమాసాలు మోసిన బిడ్డ
పాలబుగ్గల పసివాడని చూసి మురిసిపోండి
గుండెలపై అదుముకుని.. కల్లబొల్లి  కథలు చెప్పండి
గుడికి పంపండి
బడికి పంపండి
పిజ్జా, బర్గర్లు కొనివ్వండి
మారం చేస్తే బోల్డన్ని బొమ్మల్ని కొనివ్వండి
....
మీ బిడ్డ మానవాతీతశక్తికి ప్రతి రూపంగా ఫీలవ్వకండి
చిట్టి చేతులతో ఇటుకలు మోయించకండి
బుల్లి చేతులతో ఇటుకలు పగలగొట్టించకండి
తిక్క విన్యాసాల పేరుతో
లేత గుండెలపై నాపరాళ్ళు పగలగొట్టకండి
మీ బిడ్డ.. ఎప్పటికీ
పొత్తళ్ళలోని బిడ్డే
మీరు కన్న బిడ్డ..
`శతమానం భవతీ`
 అని దీవించాల్సింది మీరే
మీరు కన్నందుకు
మీ ప్రేమను పంచినందుకు
...........
సారీ.. అక్షయ
వి మిస్ యూ
వి మిస్టేకెన్ ఎబౌట్ ‍యూ..!
.....................
స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా అక్షయ అనే అయిదో తరగతి విద్యార్ధి గుండెలపై కరాటే పేరుతో బండరాళ్ళు  మోది పసి ప్రాణం ఉసురు పోసుకున్న సంఘటనకు స్పందన ఇది.... 040411

Jagaaram..

జాగారం
...
నింగిలో..
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నక్షత్రాలతో చేయీ చేయీ కలపాలని ఉంది
ఉల్లిపొరలాంటి చల్లని మేఘంపై
కాసేపు ఉయ్యాలూగాలని ఉంది
ఆనక..
చందమామా వచ్చా..
జాబిల్లి వచ్చా.. అని
అమ్మ నేర్పిన పాటను..
జాబిలమ్మకే వినిపించాలని ఉంది
........
ఏదో ఒక రాత్రి
జాగారం చేయాలని ఉంది
నాలో నేను మాట్లాడుకోవాలి
ఆనక.. అలసిపోయి
కునుకుతీయాలి
రాత్రి జాగరపు సంగతుల్ని
పగలంతా నెమరు వేసుకోవాలి

 

Sunday 3 April 2011

Ugaadi.. shubhakaram

.....
మిత్రుడు శింగరాజు మాధవ్ సాక్షిలో రాసిన ugaadi
ఆర్టికల్.. నాకు బాగా నచ్చింది.. మీరు చదవండి..
maadavji
అద్భుతమైన రాతగాడు
మంచివాడు..
మనసున్నవాడు
ఇక చదవండి

నేను శుభ ఖరం
నా దగ్గర కొత్త పూల వేప గుత్తులు ఉన్నాయి. కుంకుడుస్నానం చేసిన కురులపై అక్షింతలయ్యేందుకు అవి చేరాలుతున్నాయి. నా దగ్గర తొలికాపు మామిడి పిందెలు ఉన్నాయి. మీ ఇంటి చిన్నారి మహలక్ష్మి కాలి అందియలకున్న వెండి పిందెలను చూసి చెలిమికి బిడియపడుతున్నాయి.

తెరలను తొలగించి, వెలుగును ప్రసరించే మొదటి ఆకాంక్ష నాదే కావాలి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం / న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాః
అందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. చేతనైన సహాయం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ప్రకృతిని పూజించాలి. జోలెపట్టి ఫలాల ప్రసాదం స్వీకరించాలి. కనురెప్పలకు అద్దుకోవాలి. కృతజ్ఞత తెలుపుకోవాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి. ప్రజాభీష్టాన్ని మన్నించాలి. - ఇది నా ఆకాంక్ష.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః

ఎండలు ఎంత కాయాలో అంతే కాయాలి. వర్షాలు ఎన్ని పడాలో అన్నీ పడాలి. భూమి నిండా పాడీపంట, తల్లుల ఒడినిండా పిల్లాపాప కళకళలాడాలి. రుతువులు గతిలో ఉండాలి. బతుకులు శ్రుతిలో ఉండాలి.
సర్వేశ్వరుడికి ఇది నా నివేదన.

* * *
తెలుగిళ్ల సుప్రభాతాలకు చన్నీళ్ల చిలకరింపులు మొదట నావే కావాలి.
ఆరుబయటి వగరు గాలినై వాకిళ్లను మొదట నేనే నిద్రలేపాలి. ముంగిళ్లలో రాలుపూత ముగ్గులన్నీ నేనే వెయ్యాలి.. మనసుకు సోకే మొదటి గానం నాదే అవ్వాలి. గడప గడపకు తొలి తోరణం నేనే కట్టాలి.
ఐయామ్ ఉగాది. డాటరాఫ్ బ్రహ్మ. రెసిడెంట్ ఆఫ్... మీరుంటున్న కాలనీ. విష్యూ ఆల్ ఎ హ్యాపీ సంవత్సరాది!
‘‘ఖర్మ! శ్రీఖరా... నువ్వేమిటి? ఆ భాషేమిటి? మన సంస్కృతేమిటి? మాటల సంకరమేమిటి? ఒంటిపై లంగాఓణీ ఏమిటి? నోట్లోంచి ఆ జీన్ ప్యాంటు, టీషర్ట్‌ల పద సంప్రదాయం ఏమిటి? బ్రహ్మకు కూతురేమిటి? నారదుడొక్కడే అతడి కొడుకు కాదేమిటీ?’’
అయ్యో! మాట మారిందా?! పోనివ్వండి, నా మనసేం మారలేదు కదా! ఆకాంక్షలూ మారలేదు. నారదుడిలా నాలుగు దేశాలు తిరగబట్టి నాలుక ఏవో పొసగని చివుర్లను కరిచినట్లుంది. భాషలేవైనా భావం ఒక్కటేనని కాస్త ఉత్సాహపడినట్లున్నాను. బ్రహ్మకు మాత్రం? పేరుకే నారదుడు కానీ, పిల్లలు కానివారెవరు? భూమి మీద ఆయన జ్యేష్ట పుత్రిక నేనుగాక మరెవరు?

* * *
సృష్టి - స్థితి - లయ; బ్రహ్మ - విష్ణు - మహేశ్వర.
పుట్టించేది బ్రహ్మ. పోషించేది విష్ణువు. మోసుకెళ్లేది శివుడు.
బ్రహ్మకు ముహూర్తబలం నేను. బ్రహ్మకు ముద్దుల కూతురు కూడా నేనే. ద్వాపర యుగాంతంలో, కలియుగారంభంలో ఓ మంచి రోజు సృష్టి మొదలైంది. ‘మంచి రోజు’ అంటే మొదటి రోజు. సృష్టి నిర్మాణం కోసం కాలంలోని ప్రతి సంక్రమణంలోనూ మొదటి ఘడియనే ఎంచుకున్నాడు పితృదేవుడు.
అరవై సంవత్సరాదులలో మొదటిది - ప్రభవ.
ప్రభవలోని ఉత్తర, దక్షిణ ఆయనాలలో మొదటిది - ఉత్తరాయణం.
ఉత్తరాయణంలోని వసంత, గ్రీష్మ రుతువులలో మొదటిది - వసంత రుతువు.
వసంతంలోని చైత్ర, వైశాఖ మాసాలలో మొదటిది - చైత్రమాసం.
చైత్రంలోని శుద్ధ, బహుళ పక్షాలలో మొదటిది - శుద్ధపక్షం.
శుద్ధపక్షంలోని పదిహేను తిథులలో మొదటిది - పాడ్యమి.
పాడ్యమిలోని ముప్పై ముహూర్తాలలో మొదటిది - బ్రాహ్మీ.
బ్రాహ్మీముహూర్తంలోని సృష్టి, స్థితి, లయల్లో మొదటిది - సృష్టి.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో మొదటివాడు బ్రహ్మ. అంతటి బ్రహ్మ, సృష్టి మొదలు పెట్టిన రోజే... యుగాది. ఆ యుగాదినే నేను. కలియుగానికి ఆదిని నేను. కృతయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు మొదలైంది. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి నాడు మొదలైంది. ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశినాడు మొదలైంది. నా యుగం చైత్ర శుద్ధ పాడ్యమినాడు మొదలైంది.

ఇవాళ ఇదే చైత్ర పాడ్యమిలో... బ్రాహ్మీ ముహూర్తంలో- మీకోసం మీ ఇంటి బయట షడ్రుచులతో వేచి ఉన్నాను. గండు కోయిల నా వెంట ఉంది. దాని గొంతు నిండా లేలేత మేతల గీతికలున్నాయి. చెంతనే రామచిలకా వచ్చి వాలింది. తీపి పలుకులేవో నేర్చి దాని నోరు పండినట్లుంది!
నా దగ్గర కొత్త పూల వేప గుత్తులు ఉన్నాయి. కుంకుడుస్నానం చేసిన కురులపై అక్షింతలయ్యేందుకు అవి చేరాలుతున్నాయి. నా దగ్గర తొలికాపు మామిడి పిందెలు ఉన్నాయి. మీ ఇంటి చిన్నారి మహలక్ష్మి కాలి అందియలకున్న వెండి పిందెలను చూసి చెలిమికి బిడియపడుతున్నాయి.
నా దగ్గర ఉన్నవన్నీ కొత్తవే. చింతపండు కొత్తది. నలిగిన మిరియాలు కొత్తవి. నరికిన చెరకులు కొత్తవి. పరమాత్మకు నైవేద్యంగా పెట్టండి. పెద్దవాళ్ల చేతుల నుంచి తిరిగి అందుకోండి.

* * *
కొత్తది అంటే మొదటిది. మధురమైనది. మరువలేనిది.
తొలి ప్రేమ తియ్యనిది. తొలిముద్దు తడి ఆరిపోనిది. తొలి బిడ్డ... అపురూపమది! తొలియవ్వనం తొణికిసలది. తొలి స్నేహం విడిపోనిది. తొలి కానుక, తొలి వేడుక కలకాలం ఉండిపోయేవి.
జీవితమెప్పుడూ... అప్పుడే పుట్టినంత కొత్తగా అనిపించాలి. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడే కొత్తగా నోరు తెరుచుకుని చూస్తుండాలి. కొత్త నేల, కొత్త నింగి, కొత్త నీరు, కొత్త నిప్పు, కొత్త గాలి... జీవితపు పంచేంద్రియాలను కొత్తగా మొలకెత్తించి, కొత్తగా తలెత్తించి, కొత్తగా అభిషేకించి, కొత్తగా కణకణమనిపించి, కొత్త ఊపిరి ఊదాలి. పుట్టినప్పుడు ఉండే కొత్తదనమే, పునర్జన్మకు ముందూ ఉండాలి.

‘నా కుగాదులు లేవు, నా కుషస్సులు లేవు / నేను హేమంత కృష్ణానంత శర్వరిని
నాకు కాలమ్మొక్కటే కారురూపు... నా శోకమ్ము వలెనె, నా బతుకు వలె, నా వలెనె’-
అనిపిస్తే... ఇంటి బయటికి రండి. వేపచెట్టును చూడండి. మామిడి చెట్టును చూడండి. చెరకు గడలను చూడండి. మిరపతోటలను చూడండి. ఉప్పు కయ్యలను చూడండి.
ప్రకృతి నిండా రుచులున్నాయి. నిరాశ అనే రుచి ఎక్కడా లేదు. ప్రకృతిలో లేనిది జీవితంలో మాత్రం ఎందుకుండాలి?

UGaadi

మిత్రులందరికీ
ఉగాది శుభాకాంక్షలు

Rendadugulu


రెండడుగులు వెనక్కి
రెండడుగులు ముందుకి
వేస్తూ పోతే...
ఎక్కడివాడివి అక్కడే ఉంటావ్..
వేస్తే రెండడుగులు ముందుకెయ్

భవిష్యత్తును చూడగలుగుతావ్..
లేదంటే రెండడుగులు వెనక్కివెయ్..
నిన్నటి మంచి, చెడుల నుంచి
ఏదో ఒకటి నేర్చుకోడానికి


Nachhina Quatation

నీకు నిజంగా మనశ్శాంతి కావాలంటే....
నీ స్నేహితులతో కాక,శత్రువులతో మాట్లాడు -మదర్ ధెరిసా

We love Sparrow

పిచుక......
పిచుక. ఈ పేరు వింటేనే.. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి అనుభవం ఏదో ఒకటి గుర్తురాక మానదు. పొద్దు పొడవక
ముందే ఇంటి చూరిపై గుంపుగా వాలి.. కిచ కిచమంటూ మనల్ని నిద్రలేపిన మన ఊరి పిచుకలు గుర్తొస్తాయి.
ఆనక పొలంగట్టు పైనుంచి బిలబిలమంటూ ఎగురుకుంటూ వరికంకులపై వాలిన పిచుకలు మన మస్తిష్కంలో..
దృశ్యంగానూ మెరవొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో మన ఇంటి వాకిలి సాక్షిగా.. సందడి చేసిన పిచుకలు.. మన
నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతరిస్తున్నాయి. ఏవీ.. నిన్నా మొన్నటి దాకా
ఇంటి పెరట్లో, గొడ్ల చావిడ్లో, చెట్ల మధ్యలో ఎగురుతూ, గెంతుతూ.. సవ్వడి చేసిన పిచుకలు.. ఎక్కడా.. అని ఆరాతీసే
పరిస్ధితి నుంచి మేల్కొందాం. ఇప్పటికే పర్యావరణ వేత్తలు.. మరో కొన్నాళ్ళుపోతే... పుస్తకాల్లో మాత్రమే పిచుకల్ని బొమ్మలుగా.. చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి మేలేగానీ కీడు చేయని పిచుకలు..  ప్రజల వినియోగించే సెల్‌ఫోన్ వాటి టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల సంతానోత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. దీంతోపాటు.. పచ్చని పల్లెలన్నీ.. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. వేలెడంత పిచుకకు నిలువ నీడనిచ్చే పరిస్థితే సమాజంలో కరవవ్వడంతో.. ఇప్పడు పిచుకల మనగడ ప్రశ్నార్ధకంగా మారింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే.. పిచుక సవ్వడిని విన్నవాళ్ళు లేదా చూసిన వాళ్ళు. అరుదనే చెప్పాలి.ఈ క్రమంలో పర్యావరణ ప్రేమికులు.. పిచుకల జాతి అంతరించడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నారు. ఈ
నేపథ్యంలో పిచుకల పరిరక్షణ విషయంలో ఇప్పడిప్పుడే అనేక జీవకారుణ్య సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇదొక మంచి ప్రయత్నంగా మనమంతా సహకరించాలి.మనింటి పిల్లలు పిచుక అంటే ఎలా ఉంటుంది.. అని ప్నశ్నించకుండా ఉండాలంటే.. మనకున్నంతలో వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే. మనింటి వాకిట్లో గుప్పెడు గింజలు, కాస్త పచ్చదనం ఉండేలా ప్రయత్నిస్తే.. కచ్ఛితంగా పిచుకల కిలకిల రావాలు.. వినొచ్చు. ఒక్కొక్కటి చేరిన పిచుకల సమూహంలో మునిగి కాసేపు సేదతీరనూ వచ్చును.

Saturday 2 April 2011

Cup Gelichaamu

కంటిలో చెమ్మ
ఇంకా..
కర్చీఫ్
తడుస్తూనే ఉంది
...
గుండె సంతోషంతో తడుస్తుంది.
ఇంకా తడవాలి..
..
ఆనందంతో తడసి తడిసి
గుండె చెమ్మగిల్లాలి
...
కంటిలో చెమ్మ
ఓ ఆనందం.. ఓ అద్భుతం
ఓ.. అనిర్విచనీయం
జై భారత్..!!