Sunday 17 April 2011

కాలం కరిగిపోతుంది


కాలం కరిగిపోతుంది
వేగంగా అడుగులెయ్యి
...
దీపం ఆరిపోకముందే
ఆశల్ని వెలుగించు
....
నిన్నా మొన్నటి స్నప్నాలేవో
కృంగదీయొచ్చుకాక
ధైర్యంగా నిలబడు
...
అసాధ్యమని
మనస్సును మరల్చకు
నీవు సాధిస్తావ్..
...
అదిగో
చెమట బిందువులు
నీ పక్షానే ఉన్నాయి
..
నువ్వు కష్టపడే మనిషివి
జయించు
ఒక తరాన్ని నీతో నడిపించు
...
పేదవాడివనుకోకు
పిడికిలి బిగించు.. సాధిస్తావ్
...


 

4 comments:

  1. థ్యాంక్యు... వెరీమచ్
    మీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చా..?

    ReplyDelete
  2. ఉత్తేజపరిచే చక్కని కవిత...
    నిన్నా మొన్నటి స్వప్నాలేవో ...లైన్ లో స్వప్నాలకి బదులు నిరాశలు లాంటి పదం ఉంటే బావుంటుందనిపించింది...స్వప్నాలను సాధారణంగా ఆశావాదానికి వాడుతాం కదా. స్వప్నాలు సాధనని సాకారం చేసే సాధనాలే కాని కృంగదీసేవి కాదని నా ఉద్దేశం.

    ReplyDelete
  3. చాలా బాగా రాశారు.చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అయితే సుధగారు చెప్పిందికూడా కరక్టే...మీనుంచి ఇలాంటి మరికొన్ని అద్భుతాలకై ఎదురుచూస్తూ...

    ReplyDelete