Monday 2 May 2011

రెండు రెళ్ళు ఆరు

నిజంగానే
రెండు రెళ్ళు ఆరు
రెండు రూపాయలు సంపాదించగలిగితే
మరో నాలుగు రూపాయల


బారం నెత్తిమీద పెరుగుతూనే ఉంది
నేను సగటు మధ్య తరగతి జీవిని
నేను చదువుకున్న గుణింతాల్లో
రెండు రెళ్ళు నాలుగనే ఉంది
...
కానీ
మా పిల్లాడు చదివే
గుణింతాల పుస్తకాల్లో
రెండు రెళ్ళు ఆరు.. అని
మార్చాలి
మార్చితేగానీ
నా కొడుక్కి
నా కష్టమేంటో అర్ధంకాదు
...
పాపం వాడూ..
వాడి
.. కొడుకొస్తే
రెండు రెళ్ళు ఆరు...
కాదు కాదు
రెండురెళ్ళు పదహారు అని నేర్పుతాడేమో..?




1 comment:

  1. బాగుంది మీ కొత్త లెక్క......
    రెండు రెళ్ళు ఆరు కాదు పదారు అని ఇప్పుడే చెప్పేయొచ్చేమో...అనిపిస్తోంది..పెరిగిపోయిన సంసారపు ఆర్థిక భారాన్ని చూస్తుంటే.

    ReplyDelete