Monday 4 April 2011

Sorry.. Akshya


ఎప్పటికీ పొత్తిళ్ళలోనే పెట్టుకోండి
మీ బిడ్డ.. మురిపాల బిడ్డ
అమ్మ..నవమాసాలు మోసిన బిడ్డ
పాలబుగ్గల పసివాడని చూసి మురిసిపోండి
గుండెలపై అదుముకుని.. కల్లబొల్లి  కథలు చెప్పండి
గుడికి పంపండి
బడికి పంపండి
పిజ్జా, బర్గర్లు కొనివ్వండి
మారం చేస్తే బోల్డన్ని బొమ్మల్ని కొనివ్వండి
....
మీ బిడ్డ మానవాతీతశక్తికి ప్రతి రూపంగా ఫీలవ్వకండి
చిట్టి చేతులతో ఇటుకలు మోయించకండి
బుల్లి చేతులతో ఇటుకలు పగలగొట్టించకండి
తిక్క విన్యాసాల పేరుతో
లేత గుండెలపై నాపరాళ్ళు పగలగొట్టకండి
మీ బిడ్డ.. ఎప్పటికీ
పొత్తళ్ళలోని బిడ్డే
మీరు కన్న బిడ్డ..
`శతమానం భవతీ`
 అని దీవించాల్సింది మీరే
మీరు కన్నందుకు
మీ ప్రేమను పంచినందుకు
...........
సారీ.. అక్షయ
వి మిస్ యూ
వి మిస్టేకెన్ ఎబౌట్ ‍యూ..!
.....................
స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా అక్షయ అనే అయిదో తరగతి విద్యార్ధి గుండెలపై కరాటే పేరుతో బండరాళ్ళు  మోది పసి ప్రాణం ఉసురు పోసుకున్న సంఘటనకు స్పందన ఇది.... 040411

1 comment:

  1. ఈ సంఘటన నన్ను నిజంగా కలచివేసింది. అయిదేళ్ళ పాపపై రాయి పెట్టి సుత్తితో పగలగొట్టబోవడం ఆ సుత్తి గురితప్పి పాప చాతిపై తగలడం తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బాధతో....ప్రవీణ్ కుమార్

    ReplyDelete