Thursday 14 April 2011

సారీ చిత్రగారు


చిత్రగారి పాపకు హాయ్ చెప్పాను..
ఈ మాట అంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయ్.
*******
నాలుగైదేళ్ళ క్రితం మాట
చిత్రగారు... హైదరాబాద్‌లో కచేరి చేయడానికి భర్త, పాపతో కలిసి వచ్చారు. అప్పట్లో ఈటీవిలో పనిచేస్తున్నాను. చిత్రగారు సిటీ వస్తున్నారని తెలిసి మిగితా మీడియాకంటే ముందుగానే కలిసి ప్రత్యేక ఇంటర్వూ తేవాలని ప్లాన్ చేసుకున్నాను. అలా చిత్రగారిని కలిశాను.
నాలక్కీ ఏమిటంటే... నేను ఇలా హోటల్ గదికి చేరుకున్నానో... లేదో.. చిత్రగారికి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనట్టు ఫోనొచ్చింది.
నా ఆనందానికి అవదుల్లేవు.
అసలే చిత్రగారి ఇంటర్వ్యూ, పైగా పద్మశ్రీ వచ్చిన సందర్భం..
మేము కెమెరా.. లైట్స్ సెట్ చేసుకుంటున్న క్రమంలోనే చిత్రగారికి ఫోన్ల తాకిడి మొదలయ్యింది. అయినా చిత్రగారు కెమెరా ముందు కూర్చుని కమ్మగా మాట్లాడుతూ... సారీ పాట్లాడుతూ ఉన్నారు
******
మధ్యలో
ఓ బుల్లి పాప.. మళయాళ భాషలో ఏదో సవ్వడి చేసుకుంటూ చిత్రగారి వళ్లో వాలిపోయింది.
కెమెరా రికార్డింగ్ ఆపకుండానే మేమంతా ఆ ముచ్చట షూట్ చేసేశాం..
`ఈ కుట్టి మన దగ్గరుంటే ఇంటర్వ్యూ సాగదు.. ` అంటూ
పాప.. నందనను మరో రూంలోకి పంపబోయారు చిత్ర..
అప్పడే చిత్రగారి పాప నందనను మొదటిసారి చూశాను.. అదే ఆఖరుసారి కూడా.
అటు ఇటు రెండు పిలకలేసుకుని.. చాలా ముద్దుగా ఉంది.
హాయ్ అని చెప్పా.. అమాయకంగా నవ్వింది.
పాపలో.. దేవుడు కొంచెం అమాయక పాల్లు.. పోశాడనిపించింది
....
పాప గదిలో అల్లరి చేస్తుండగానే.. చిత్రగారు ఇంటర్వ్యూ పూర్తి చేశారు..
ఇంటర్వ్యూ పూర్తవ్వగానే.. గదిలో బంధించిన పాప బిలబలమంటూ బయటకొచ్చేసింది.
...
మరోసారి మేమంతా నందనకు హాయ్ చెప్పాము
అప్పడు నందన మూడేళ్లపాప
ఇప్పడు నందన ఎనిమిదేళ్ళ పాప
దేవుడు నందనకు అమాకపాల్లు ఎక్కువ పోశాడని ముందే చెప్పాగా..
మూడేళ్లప్పుడు ఎలా ఉందో..
ఎనిమిదేళ్ళప్పుడు కూడా అదే అమాకత్వం..
అందుకే నందన..
నీటిని ఓ నేస్తం అనుకుంది
..
సారీ నందన
నీకు తెలియదా?
నీకు నీటి గండం ఉందని..
.....
సారీ చిత్రగారు
మీరెప్పుడూ నవ్వుతూ ఉంటారు
నందన కోసం ఆ నవ్వును అలాగే కొనసాగించండి
నందన కోసం పూలపరిమళాల పాటలు ఇంకా ఇంకా అద్దండి
...
యిక్కడ నుంచి మీరు పాడే లాలిపాటల్ని
నందన కచ్ఛితంగా
అక్కడనుంచి వింటుంది
...
మీరు పాడే పాట రూపంలో
నందన
ఎప్పటికీ మీ వెంట ఉంటూనే ఉంటుంది
........
.......

1 comment:

  1. గంగాధర్ గారు ఈవార్త విన్న తరువాత నేను కూడా చాలా బాధపడ్డాను. చిత్రగారికి నా ప్రగాఢ సానుభూతి

    ReplyDelete