Saturday, 30 April 2011

మేడే.. ఈనాడే

ప్రపంచపు నలుదిక్కుల నీవు
ప్రపంచ గమనానివి నీవు
ఉప్పెంగె గీతం నీవు
ఆకాశానికి నిచ్చెన నీవు
.......
అభివృద్ధికి వెలుగుల రేఖవు నీవు
అభ్యుదయానికి కాంతి నీవు
.....
మానవాళి పాటవు నీవు
మానవత్వానికి బాటవు నీవు
......
శ్రమకు నిర్వచనం నీవు
నవతకు శుభోదయం నీవు
....
మండుటెండలో
స్వేదం చిందే కర్తవ్యానివి నీవు
శ్రామికుడు నీవు
కార్మికుడు నీవు
.....
ప్రియతమ కార్మికులారా
మరో ప్రపంచం కోసం
సంఘటితంగా ఉద్యమిద్దాం
.......

Tuesday, 26 April 2011

ఇద్దరిదీ ఒకే ఊరు

ఇద్దరిదీ ఒకే ఊరు
ఇద్దరిదీ ఒకే వీధి
ఇద్దరు చదివిందీ ఒకే బడి
ఇద్దరు నడిచింది ఒకే నేల
ఇద్దరు మొక్కిందీ ఒకే దేవుడు
కానీ..
వాడు నాకంటే పైకి
ఎదిగిపోతున్నాడని నాకు మహా కుళ్ళు..
వాడికీ అంతే
నేనెక్కడ వాణ్ణి మించిపోతానేమోనని
....
ఇద్దరిదీ ఒకే కొలువు
కానీ ఎప్పుడూ మాట్లాడుకోం
వాడిల్లే దారిలో నేను
నేను వెళ్ళేదారిలో వాడు
గోతులు తవ్వుకుంటుంటాం
...
మేం నీతిమంతమైన
అక్షరాలు తెలిసిన మేధావులం
ఎదుటివాడికి నీతులు చెప్పే
అంబోతులం

Saturday, 23 April 2011

చరణ కమలాలకు ....


దివ్యజ్యోతి రూపంలోకి
మారిన అమృతమూర్తి
భౌతికంగా మానవాళికి
దూరంగా వెళ్ళినాగానీ..
అచంచలమైన మానవతావాదాన్ని
ప్రపంచానికి అందించిన
బాటను ఎవ్వరూ
దాటిపోలేరు.
దూరంకాలేరు
బాబా.. ఓ సేవానిరతి
బాబా.. ఓ అద్వితీయ శక్తి
బాబా.. కోట్ల ప్రజల విశ్వాసం
బాబా.. నిరంతర గమనం
బాబా.. ఓ ఆత్మవిశ్వాసం
బాబా..
మనల్ని నడిపించే శక్తి
.......
....
చరణ కమలాలకు
అంజలి ఘటిస్తూ......

Friday, 22 April 2011

అద్దం ముందు

అద్దం ముందు
నిజంగా వంకర్లు పోయేది
మగవాళ్ళే..
నాతో సహా..

ఈనాడు‌లో

ఈనాడు‌లో పనిచేసేటప్పుడు.. ఆడవారు అబలలు కాదు.. కండలు తిరిగిన మగవాళ్లను సైతం ధైర్యంగా చిత్తుచేసే మహరాణులు కూడా అనే అర్ధంలో నగరంలో పెరుగుతున్న మహిళా యోగా సెంటర్లు‌పై సిటీ పేజీల కోసం ఆర్టికల్ రాశాను. నేను రాసిన ఆర్టికల్‌కు నేనే వేసిన  బొమ్మనే ఆ.. ఆర్టికల్‌కు వాడుకున్నారు.. ఆ బొమ్మను భద్రంగా దాచుకోవడంవల్ల.. ఇప్పడు ఇదిగో ఇలా బ్గాగులో దర్శనం ఇచ్చింది

Thursday, 21 April 2011

శబ్దాలు మారుతున్నాయ్

శబ్దాలు మారుతున్నాయ్
నిశ్శబ్దం రాను రాను
ఘొల్లుమంటుంది.
.....
ఆకలి అర్తనాదాలూ...
మూగబోతున్నాయ్
....
వలసలు
వరస క్రమంలో
పట్నాలకు క్యూ కడుతూనే ఉన్నాయి
...
పల్లెలు.. తోడులేక
ఘొల్లుమంటున్నాయి
...
పట్నంలోని బతుకూ...
గూడులేక
నిశిరాత్రి వరకూ
బువ్వకష్టాలు పడుతూనే ఉంది
....
పల్లెలు
పట్నాలు..  రెండూ
మూగబోతున్నాయ్.
సారీ......
రోదిస్తున్నాయ్

Tuesday, 19 April 2011

కాక్‌టైల్ మత్తులో

కాక్‌టైల్ మత్తులో జోగినట్టు
పొద్దంతా
గందరగోలపు సుడులు తిరుగుతోంది
దిక్కుమాలిన
ఆలోచనలు.. ఒకటీ
స్పష్టంగాలేవు
నిన్న ఎలాగోలా గడిచిందనే
ఆనందం.. క్షణపాటైనా ఉంటేగా
రెక్కలు కట్టుకుని మరీ
ఈరోజు..
ఏదో బద్ద శతృత్వం ఉన్నట్టు
సుడులు సుడులుగా
మెదడ్ని
తురుమేస్తుంది
...
ఇరానీ ఛాయ్ తాగినా
వదిలిపోని నిట్టూర్పు
వడగాలికే భయం పుట్టేంత
శ్వాషలో వేడిగాలులు
...
దేనికో వెదుకులాట
అడ్రస్ తెలిస్తే..
వెళ్లిపట్టుకోడానికి
...
వెదకాలి
పొద్దనక
రాత్రనక
జీవితమనక..