Friday, 19 April 2013

జ్ఙానపీఠం
.....

బడికి
గుడికెళ్తేనే..జ్ఙానోదయం కాదోయ్
మనసులో గుడి
మన తీరులోనే బడి ఉంటే చాలోయ్ 
..
జ్ఙానానికి సమదూరం
ఎటు అని అడిగితే?
కల్మషంలేని జీవితం
ఫలం ఆశించని తత్వం
గుండెల్లో ఉంటే
జ్ఙానపీఠం అదిరోహించొచ్చన్న
సత్యం.. ఆంధ్ర ఠాగూర్ భరద్వాజ నేర్పిన పాఠం
...

గురు పూజ్యులు భరద్వాజ గారికి నమస్సులతో 
- గంగాధర్ వీర్ల
20-04-2013

Sunday, 7 April 2013

కళ్ళు
కొవ్వుత్తులా వెలిగి
కరిగి పోతున్నాయిగానీ..
రాష్ట్రంలోని కిరణాలు మాత్రం
విద్యుత్ వెలుగివ్వలేకపోతున్నాయ్.
చీకటి రాజ్యంలో
ప్రజల ఇక్కట్లన్నీ
సర్కార్ మతిలేని పాలనలో
అడవికాచిన వెన్నెలవుతున్నాయి
.............
గంగాధర్ వీర్ల
070413- 7.35

Sunday, 9 December 2012

కూరుకు పోయా

ప్రేమ లోతుల్లో
 .....................

నీ ఊహల శిఖరాగ్రాన నిలబడాలని ఉన్నా..
ఇప్పటికే నీ ప్రేమ లోతుల్లో కూరుపోయాగా?
.....

Saturday, 8 December 2012

ఎటైనా వెళ్ళేందుకు

ఎటైనా వెళ్ళేందుకు
...............................

నాలుగు కూడళ్ళో నిలబడింది దారితెలియక కాదు
ఎటైనా వెళ్ళేందుకు అనుకూలమనే.
............ 09-12-2012

Friday, 7 December 2012

ధీశాలిని

నిన్ను కోల్పోయే త్యాగశీలిని కాదు
నీ ప్రేమకై జీవితాన్ని ధారపోసే ధీశాలిని

.............. 07-12-2012(రాత్రి 11.30)

||నీ సేవకుడ్నే||

 ||నీ సేవకుడ్నే||

ఏమిటి??
మూతి బిగింపు
...
అందాల రాశివి
అపురూప సౌందర్యానివి
భూలోక అప్సరసవు..
..
అతిలోక సుందరివి
అని పొగడలేదనేకదా
ఆ మూతి బిగింపు
....
అవన్నీ
మాటల గారడీలు మాత్రమే
..
అసలు
నాకు నువ్వు ఎవరో తెలుసా?
..
నా హృదయాన్ని
ఏలే రాకుమారివి
నేను మాత్రం
నీ సేవకుడ్నే

నిరీక్షణ 
నిన్నా మొన్నటి వరకూ
నా హృదయాన్ని గెలిచే మరో హృదయం
ఎక్కడా అని ఎదురు చూశాను..
...
నువ్వే అని తెలిసిన తర్వాత
నా హృదయం నీదేనని చెప్పడానికి..
మళ్లీ నిరీక్షణేనా...

  06-12-2012,  12.13