Tuesday, 27 November 2012

ఎక్కడెక్కడ ఉన్నావని


ఎక్కడెక్కడ ఉన్నావని వెదకను
విశ్వమంతా పరిభ్రమించే నిన్ను
......
నీలోకి తొంగి చూడనివ్వవు
అర్ధంకావు.
ఆలోచనకు దొరకవు
..........
నవ్విస్తావు..
మురిపిస్తావు
ఆడిస్తావు
.....
ఇవన్నీ చాలవన్నట్టు
వెనకనే ఉంటూ ఏడిపిస్తావు
...
ఎక్కడెక్కడ ఉన్నావని వెదకను
విశ్వమంతా పరిభ్రమించే నిన్ను
...
ఈశ్వరా.. ఇక చాలునయ్యా...
...........

Saturday, 17 November 2012

రెమ్మచాటున


రెమ్మచాటున
క్రీనీడలో...
ఏదో అందం దోబూచులాడుతోంది
తేరిపార చూద్దామన్న
కానరాలేదు.
నిముషాలు గంటలవుతున్నాయి
ఆ అందం మాత్రం
పచ్చని రెపరెపల మాటున 
ఊరిస్తూనే ఉంది.
.........................
.........................
మంచెతెర దగ్గరగా వచ్చి
వేకువను నిద్రలేపింది..
అదిగో.. నిశిరాత్రిన
ఆటపట్టించిన ఆ అందం..
మొగ్గై నవ్వింది.
ఆనక తెలతెలవారంగనే
పువ్వై పరిమళించింది.
ఏ వనిత తల్లోనో మెరిసేందుకు
ప్రకృతి కాంతను ముస్తాబు చేస్తోంది.