Saturday 3 October 2015

థికింగ్ సో..!!
........
అరచేతిలో రెండు గులకరాళ్ళు
రెండింటివి పరస్పర వ్యతిరేక దృవాలే
అవికలలుగనే దృశ్యం వేరు
సాదృశ్యమూ వేరు
ఒకదానికి ..
నాటి బాల్యపు ముచ్చట్లు ఎక్కడున్నాయోనని వెదుకులాట
మరొకదానికి..
వర్తమానపు పీకులాటల్ని
వెదికి గురిచూసి కొట్టాలనే కసి
రెండింటి ఆలోచనలకీ
రెండింటి ఆత్రాలకీ అసలు పొంతనే లేదు
రెండు గులకరాళ్ళు దెబ్బలాడుకుంటున్నాయి
వాదులాడుకుంటున్నాయి
పొంతనలేని సంఘర్షణలో
అర్ధం లేని చప్పళ్ళు చేస్తూనే ఉన్నాయి
000
ఒకటి నిన్న
మరొకటి నేడు
రేపటి దారిలో మరొకటేమో!?
అరచేతిలో రెండు గులకరాళ్ళు
తీరం వెంబడి ప్రయాణించే భావోద్వేగాలు!!
03-10-2015



1 comment:

  1. బాగుంది గంగాధర్ జీ.. మీ మానసిక సంఘర్షణకు ్రపతిరూపంలా ఉంది...

    ReplyDelete